AAA Teaser Talk: A Perfect Beginning రవితేజ ‘అమర్ అక్బర్ అంటోనీ’ టీజర్

Amar akbar anthony teaser ravi teja promises an interesting thriller

mass maharaj, ravi teja, Amar Akbar Anthony Teaser, Ileana, Ileana D'Cruz, Sunil, Laya, Sreenu Vaitla, Thaman S, Mythri Movie Makers, Naveen Yerneni, Y. Ravi Shankar, Mohan, movies, entertainment, tollywood

Amar Akbar Anthony is slated to hit the screens on November 16. This will be Ravi Teja's third film to release this year after Touch Chesi Chudu and Nela Ticket.

రిలాక్స్ అంటూ రవితేజ ‘అమర్ అక్బర్ అంటోనీ’ టీజర్

Posted: 10/29/2018 05:48 PM IST
Amar akbar anthony teaser ravi teja promises an interesting thriller

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతూ.. త్వరలో ప్రేక్షకులముందుకు రాబోతున్న చిత్రం అమర్ అక్బర్ అంటోని. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఇవాళ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది. తమన్ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ చిత్రంలో రవితేజ.. అమర్‌, అక్బర్, ఆంటోనీగా త్రిపాత్రాభినయం చేస్తుండగా, ఆయన సరసన పొడుగు కాళ్ల సుందరి, గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు.

‘ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మనచుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం’ అంటూ ధైర్యాన్ని నూరిపోస్తున్నాడా.? అన్నట్లుగా వుంది రవితేజ డైలాగ్. ముగింపు రాసుకున్న తర్వాతే కథను మొదలు పెట్టాలి’ అనే డైలాగ్ తో టీజర్‌ ఆరంభమైంది. ‘మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మనచుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం’ అంటూ రవితేజ హీరోయిజం చూపించారు.

‘వాడు ఎక్కడుంటాడో.. ఎలా ఉంటాడో.. ఎలా వస్తాడో.. ఎవ్వరికీ తెలియదు..’ అని చిత్రంలోని విలన్ పాత్రధారి చిత్ర హీరో మాస్ మహారాజ రవితేజను ఉద్దేశించి అనే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. చివర్లో రవితేజ.. ‘రిలాక్స్‌’ అని అనడం హైలైట్ గా నిలిచింది. నవంబరు 16న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక అలస్యమెందుకు మీరూ టీజర్ ను ఓ లుకెయ్యండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amar akbar antony  ravi teja  illeana  Sreenu Vaitla  Thaman S  Mythri Movie Makers  tollywood  

Other Articles