no matter of dissapointment to mega fans కొత్త స్టెప్పులతో అలరించనున్న మెగాస్టార్

Mega star sye raa to entertain fans with new dance moves

Mega powerstar Ram Charan, Sye Raa Narasimha Reddy, Boyapati Srinu, megastar Chiranjeevi, freedom fighter biopicMega Fans, Nayantara, periodic movie, dance moves, shekar master, choreographer, movies, entertainment, tollywood

Thrashing all the rumours from megastar Chiranjeevi film Sye Raa, Konidela production unit says there is no matter of disappointment to Mega Fans, Even being a period movie the dancing skills and moves will be presented in the movie in a different style.

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కన్నుల పండగ..

Posted: 10/27/2018 02:36 PM IST
Mega star sye raa to entertain fans with new dance moves

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొణిదెల ప్రోడక్షన్స్ పై నిర్మతమవుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితచరిత్రగా ఈ సినిమాను ఎంతో ప్రతిషాత్మకంగా రూపొందిస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.  చిరంజీవికి జంటగా ఈ సినిమాలో కథానాయిక నయనతార, ముఖ్యమైన పాత్రలో తమన్నా కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు అద్బుతంగా డాన్స్ చేసేవారు కావడంతో.. ఈ చిత్రంలో డాన్సులు, కొత్త స్టెపులు కూడా అలరించనున్నాయి.

అయితే తొలితరం స్వతంత్ర సమరానికి సంబంధించిన చిత్రం కావడం.. ఇందులో సైరా నరసింహారెడ్డి పాత్రలో మెరవనున్న చిరంజీవి అధికంగా సతంత్ర పోరాటాలు, ఉద్యమంపైనే అధికంగా తన శ్రమను పెట్టారని వార్తలు చిత్రపురి వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో అటు చిరంజీవి అభిమానులు కాసింత నిరాశకు గురవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు అశించే స్థాయిలోనే సైరా చిత్రం కన్నుల పండగగా నిలుస్తుందని చిత్రనిర్మాన వర్గాలు వెల్లడించాయి.

కథా నేపథ్యానికి తగినట్టుగానే డాన్సులు ఉంటాయనీ .. అభిమానులు నిరాశ చెందవలసిన అవసరం లేదనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవిపై చిత్రీకరించే పాటలకు శేఖర్ మాస్టర్ డాన్సులు కంపోజ్ చేశారు. అయితే ఇంకా కొత్తగా ఉండేలా చూడమని చిరంజీవి సూచించడంతో శేఖర్ మాస్టర్ కొత్తగా అనిపించే స్టెప్స్ ను డిజైన్ చేసుకుని మంచి మార్కులు కొట్టేయడానికి గట్టి కసరత్తునే చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు హైలైట్ గా నిలవనున్నాయన్న టాక్ కూడా వినబడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles