ఫటాస్ చిత్రం తరువాత విజయలక్ష్మి కరుణకటాక్షల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా హీరో కళ్యాణ్ రామ్. తన కృషిలో లోపం లేకపోయినా మనసుకు నచ్చిన కథలు తెరమీదకు వచ్చేటప్పటికి ఫలితాలు తేడా కొడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు ఎమ్మెల్యే-నా నువ్వే తో పలకరించిన నందమూరి నటవారసుడికి హిట్ మాత్రం దక్కలేదు. అయినా తన ప్రయత్నలోపం లేకుండా తనమూడవ చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు రెడీ చేస్తున్నాడు కల్యాణ్.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ రచనా దర్శకత్వంలో, కోనేరు మహేష్ నిర్మాణసారథ్యంలో తెరకెక్కుతున్న తన తదుపరి చిత్రంలో కళ్యాణ్ రామ్ భారీ రిస్క్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపుగా 90 శాతం పూర్తైన ఈ చిత్రంలో కేవలం ఒక పాటు, ఒక ఫైటింగ్ సన్నివేశాలను మాత్రమే షూటింగ్ చేయాల్సింది వుంది. ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా చిత్రం మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ సాహసం చేయబోతున్నాడు.
కథలో భాగంగా వచ్చే ఒక కీలకమైన ఎపిసోడ్ కోసం దీన్ని వైజాగ్ సముద్రంలో తీయబోతున్నారు. ఇందుకోసం ఫారిన్ నుంచి డైవింగ్ ఎక్స్ పర్ట్స్ ని కూడా పిలిపించబోతున్నారు. కళ్యాణ్ రామ్ సైతం డూప్ లేకుండా నిపుణుల సహాయంతో స్వంతంగా చేయడానికి డిసైడ్ అయినట్టు తెలిసింది. ఇది యాక్షన్ నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్ గా ఉంటుందని తెలిసింది. దీంతో పాటు ఇంకొక్క పాట షూట్ చేస్తే గుమ్మడి కాయ కొట్టవచ్చు. రెండు మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నా యూనిట్ ఫైనల్ గా ఏ నిర్ణయానికి రాలేకపోతోంది. సెప్టెంబర్ 13 వినాయక చవితి పండగ సందర్భంగా దీని ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more