Jyothika Re-enters Tollywood with Jhansi టాలీవుడ్ లోకి జ్యోతిక రీఎంట్రీ.. 17న ఝాన్సీగా..

Actress jyothika re enters tollywood with jhansi movie

jhansi, Jhansi teaser, sudheer babu, jyothika, surya, kollywood, nachiyar, Tollywood, jyothika re entry, jyothika latest, jyothika surya, Tollywood, Bollywood, movies, entertainment

Actress Jyothika re-enters tollywood with upcoming moive Jhansi, which remake of Nachiyar Tamil movie. This teaser was launched by Tollywood hero Sudheer Babu. This film is set to release on August 17th.

టాలీవుడ్ లోకి జ్యోతిక రీఎంట్రీ.. 17న ఝాన్సీగా..

Posted: 08/11/2018 05:21 PM IST
Actress jyothika re enters tollywood with jhansi movie

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా జ్యోతికకి ఎంతో క్రేజ్ వుంది. సూర్యతో వివాహం తరువాత సినిమాలలో నటన నుంచి కొంత గ్యాప్ తీసుకునన్న అమె.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే తమిళంలో రీఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకున్న జ్యోతిక.. ఇక ఈ నెల 17 తెలుగు ప్రేక్షకులను రీఎంట్రీతో పలకరించనుంది. తన వయసుకి తగిన ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటూ.. విజయాలను అందుకుంటోన్న జ్యోతిక.. ఈ ఏడాది ఆరంభంలో తమిళంలో ఆమె చేసిన 'నాచ్చియార్' తో కాలీవుడ్ లో విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు అదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసిన చిత్ర బృందం.. తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సన్నాహాలను సిద్ధం చేసింది. రీమేక్ అయినా ఇందులోనూ జ్యోతికే ప్రధాన పాత్రలో నటించిన ఈ ఆగస్టు 17న రిలీజ్ కానున్నది. కోనేరు కల్పన, డి అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా సంయుక్తంగా రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్ర టీజర్‌ను ఇటీవల సమ్మోహనం చిత్రంతో మంచి విజయం సాధించిన యువ హీరో సుధీర్ బాబు విడుదల చేశారు.

ఈ సినిమాలోని పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉండటంతో, ప్రేక్షకుల మనసులను పట్టేసింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో జ్యోతిక నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.విమర్శకుల నుంచి కూడా ఈ సినిమా ప్రశంసలను కొట్టేసింది. దర్శకుడిగా 'బాలా'కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. జీవీ ప్రకాశ్ కుమార్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఇక్కడ ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jhansi  Jhansi teaser  sudheer babu  jyothika  surya  kollywood  nachiyar  Tollywood  

Other Articles