Vishwaroopam 2 First Day Box Office Collections కమల్ విశ్వారూపం-2 బాక్సాఫీసు వసూళ్లు..

Kamal haasan s vishwaroopam 2 shatters a baahubali 2 day 1 record

Kollywood, Vishwaroopam 2 box office collection, Vishwaroopam 2 box office, Vishwaroopam 2 1 day collection, Vishwaroopam 2 chennai box office, Baahubali 2, Vishwaroopam 2, box office collection, day collection, chennai box office, Kollywood, Tamil Nadu

Kamal Haasan's Vishwaroopam 2 earned close to Rs 93 lakh at the Chennai box office. This is considered to be a good number for a non-holiday release.

బాహుబలి-2ను మించిన విశ్వారూపం-2 వసూళ్లు

Posted: 08/11/2018 04:18 PM IST
Kamal haasan s vishwaroopam 2 shatters a baahubali 2 day 1 record

కమల్ హాసన్ పేరు తెలియని భారతీయ చలనచిత్ర అభిమాని అంటూ ఉండరని చెబితే అతిశయోక్తి కాదు. అలాంటి నటుడు దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రమే విశ్వరూపం-2. విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం విడుదలపై కొంత సంగ్ధిదత నెలకొన్న క్రమంలో ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. మరీ ముఖ్యంగా తమిళనాడులో కరుణానిధి సంతాప దినాల నేపథ్యంలో విశ్వరూపం2 విడుదల ఉంటుందా? ఉండదా? అనే స్పష్టమైన సమాచారం లేకుండా పోయింది.

అయినప్పటికీ ఈ సినిమాకు తమిళనాట మంచి స్థాయిలో కలెక్షన్స్ రావడం విశేషం. తొలి రోజున చెన్నైలో కమల్ హాసన్ సినిమా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ ను పొందింది.. ఇంకా చెప్పాలంటే తమిళనాడులో బాహుబలి-2 చిత్రాన్ని మించిన కలెక్షన్లను కమల్ విశ్వరూపం రాబట్టిందని అక్కడి ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒక్క చెన్నైలోనే ఈ సినిమా 93 లక్షల రూపాయల ఓపెనింగ్ డే వసూళ్లను పొందిందని సమాచారం. విడుదలపై అనిశ్చితి నెలకొన్నా.. ఈ స్థాయి వసూళ్లు రావడం గమనార్హమని ట్రేడ్ పండితులు అంటున్నారు.

చెన్నైతో పాటు మిగతా తమిళనాట కూడా ఈ సినిమాకు ఇదే స్థాయి ఓపెనింగ్స్ ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా అంత పాజిటివ్ టాక్ పొందలేదు. నెగిటివ్ రివ్యూలే ఎక్కువగా దర్శనమిచ్చాయి. ప్రత్యేకించి విశ్వరూపం ఫస్ట్ పార్ట్ తరహాలో ఈ సీక్వెల్ ఉంటుందని ఆశలు పెట్టుకుని వెళితే అడియాసలు తప్పవని రివ్యూయర్లు వ్యాఖ్యానించారు. ఈ రివ్యూల ప్రభావం ఈ సినిమాపై పడే అవకాశాలున్నాయి. అయితే వీకెండ్ వరకూ ఈ సినిమా మంచి స్థాయిలోనే వసూళ్లను సంపాదించుకునే అవకాశాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles