Ma Ma Mass Govindam! కాకరేపుతున్న గీతా గోవిందం కొత్త పోస్టర్..

Curtains raised for geetha govindam teaser

Geeta Govindam, Vijay Devarakonda, Rashmika Mandana, allu aravind, parasuram, Geeta Govindam teaser, Geeta Govindam new poster, Geeta Govindam mass poster, Geeta Govindam poster ire, tollywood, movies, entertainment

Vijay Devarakonda, the heartthrob of youth, is now looking to penetrate into the masses too. His upcoming film Geeta Govindam seems to be a commercial package covering all elements that cater to all section of audience.

గీతా గోవిందం టీజర్ రిలీజ్ అదే రోజున

Posted: 07/19/2018 05:31 PM IST
Curtains raised for geetha govindam teaser

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస సినిమాలతో మంచి జోరుమీదున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బేనర్ లో 'గీత గోవిందం' అనే మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ వస్తుండగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ధియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం తొలి పాటకు అప్పుడే 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ పాట సరిగ్గా వారం రోజుల క్రితం విడుదల కాగా, దానిని అప్పుడే కోటి మంది వీక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ ఆదివారం అంటే 22వ తేదీన ఉదయం 11 గంటల 5 నిమిషాలకి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇంతవరకూ పోస్టర్స్ ద్వారా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కథానాయిక బరువు బాధ్యతలు తనవే అనే ఉద్దేశాన్ని ఈ పోస్టర్స్ ద్వారా కథానాయకుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ట్విట్టర్ ద్వారా కూడా బరువు బాధ్యతలను గురించి విజయ్ దేవరకొండ ప్రస్తావిస్తూ ఉండటం విశేషం. టీజర్ తో అంచనాలు పెంచడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది. యూత్ లో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన నుంచి వస్తోన్న మరో ప్రేమకథా చిత్రం కావడంతో, కుర్రకారంతా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Geeta Govindam  Vijay Devarakonda  Rashmika Mandana  allu aravind  parasuram  tollywood  

Other Articles

Today on Telugu Wishesh