వరుసగా చల్ మోహనరంగా, లై చిత్రాలు బాక్సాఫీసు వద్ద అపజయాలను మూటగట్టుకున్న నేపథ్యంలో తెలుగు సంప్రదాయంతో పెళ్లి కాన్సెప్టుతో అటు కుటుంబ ప్రేక్షకులతో పాటు ఇటు యూత్ ను అకట్టుకునే విధంగా కొత్త కథనంతో యంగ్ హీరో నితన్ వస్తున్నాడు. ఈ చిత్రంలో రాశి ఖన్నా.. నితన్ సరసన కథానాయిక పాత్రలో నటించనుంది. దర్శకుడు సతీశ్ వేగేశ్న 'శ్రీనివాస కళ్యాణం' సినిమాను రూపొందించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు.
"మనం పుట్టినప్పుడు మన వాళ్లంతా ఆనందపడతారు .. అది మనకి తెలియదు. మనం దూరమైనప్పుడు మన వాళ్లంతా బాధపడతారు .. అదీ మనకి తెలియదు. మనకి తెలిసి మనం సంతోషంగా వుండి .. మనవాళ్లంతా సంతోషంగా వుండేది ఒక్క పెళ్లిలో మాత్రమే. అలాంటి పెళ్లి గొప్పతనం గురించి చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ 'శ్రీనివాస కళ్యాణం' " అంటూ జయసుధతో చెప్పించిన వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 22వ తేదీన జరపనున్నట్టుగా ఈ టీజర్ ద్వారానే తెలియజేశారు. జయసుధ .. ప్రకాశ్ రాజ్ .. సీనియర్ నరేశ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు.
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more