Fans rescue Actress from a drunk man on train కమిట్ మెంట్ కోసం.. నటి నిలబడి రైలు ప్రయాణం

Fans rescue actress mehreen pirzada s from a drunk man on train

Mehreen Pirzada, mehrene kaur pirzada, chennai, drunk man, hyderabad, vijay devarakonda, Nota, gopichand, pantham, director Chakravarthy, movies, entertainment, tollywood

Actress Mehreen Pirzada has come in for praise from the crew of her upcoming Tamil film Nota (2018) and her fans, after she braved the harassment she was subjected to by a drunk person on a train.

కమిట్ మెంట్ కోసం.. నటి నిలబడి రైలు ప్రయాణం

Posted: 06/30/2018 11:58 AM IST
Fans rescue actress mehreen pirzada s from a drunk man on train

అభిమానుల కలల రాణులు సినీమా హీరోయిన్లు.. వారికేం  కార్లు, బంగ్లాలు, సమాజంలో పేరు ప్రఖ్యాుతులు అంటూ సామాన్యులు నిట్టూరుస్తారు. అయితే వారు అలా ఎదగడానికి ఎన్ని కష్టాలు పడతారన్నది హైదరాబాద్ టు చెన్నై రైలు ప్రయాణం మన ముందుకు తీసుకువస్తుంది. కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మెహరీన్..  యువ హీరోలతో అవకాశాల మీద అవకాశాలు సొంతం చేసుకుని, దక్షిణాది సినీ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇలా అవకాశాలు రావడానికి అమె కమిట్ మెంటే కారణం. తన కమిట్ మెంట్ విషయంలో మాత్రం ఎంతటి వ్యవప్రయాసలైనా ఓరుస్తానని అమెకు ఇటీవల ఎదురైన ఓ ఘటన తెలిపింది. కార్లు, డ్రైవర్లు ఎందరున్నా.. ఒక్కోసారి కష్టాలు మాత్రం ఎదురవ్వక తప్పదు. అదే కష్టం ఎదురైన నటి మెహరీన్.. రైలులో కొన్ని గంటల పాటు నిల్చునే ప్రయాణం చేసింది. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం తమిళ చిత్రం 'నోటా'లో నటిస్తున్న ఆమె, సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి చెన్నైకి ఆమె ప్రయాణం చేయాల్సి వుండగా, విమానంలో టికెట్ దొరకక పోవడంతో రైల్లో ప్రయాణించేందుకు అంగీకరించిందట.

సదరు నిర్మాత ఓ బెర్త్ బుక్ చేయించగా, తాను రైలు ఎక్కే సమయానికే పూటుగా తాగిన ఓ వ్యక్తి, తన బెర్త్ ను ఆక్రమించాడట. అతన్ని చూసి భయంతో వణికిపోయిన మెహరీన్, అతన్ని కదపడం ఇష్టంలేక చాలాసేపు రైల్లో నిలబడే ఉందట. చివరకు పంతం సినిమా దర్శకుడు చక్రవర్తికి అమె ఫోన్ చేసి విషయం చెప్పడంతో, ఆయన స్పందించి, రెండు కార్లలో తన మనుషులను పంపారు. దీంతో అమె ఆ వెంటనే వచ్చిన రైల్వే స్టేషన్లో దిగి.. అక్కడి నుంచి కారులో చెన్నైకి ప్రయాణం చేసింది. క్షేమంగా చెన్నైకి చేరుకున్న అమె తన అభిమానులు, చక్రీకి ధ్యాంక్స్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mehreen Pirzada  Nota  chennai  drunk man  hyderabad  gopichand  pantham  director Chakravarthy  tollywood  

Other Articles