'Nela Ticket' wraps up censor formality రవితేజ ‘నేల టిక్కెట్’ సెన్సార్ పూర్తి

Ss rajamouli heaps praise on ee nagaraniki emaindi and sammohanam

Tharun Bhascker, Sudheer Babu, SS Rajamouli, Sammohanam, Ee Nagaraniki Emaindi, movies, entertainment, tollywood

Maverick director SS Rajamouli is known for showering praise on feel-good movies. He has now heaped a praise on the recently released movies ‘Ee Nagaraniki Emaindi’ and ‘Sammohanam’.

ఆ రెండు కొత్త సినిమాలపై జక్కన్న ప్రశంసల జల్లు

Posted: 06/29/2018 07:01 PM IST
Ss rajamouli heaps praise on ee nagaraniki emaindi and sammohanam

తెలుగు వెండితెర ఘనకీర్తిని విశ్వవ్యాప్తం చేసిన దర్శక దిగ్గజం జక్కన్న.. ఎస్ ఎస్ రాజమౌళి తన మదికి నచ్చిన చిత్రాలపై ప్రశంసలు కురిపించడం పరిపాటే. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు తాజా చిత్రాలపై కూడా ఆయన ప్రశంసలను కురిపించారు. సుధీర్ బాబు హీరోగా విడుదలైన చిత్రం సమ్మోహనంతో పాటు యువ నటులు నటించిన ఈ నగరానికి ఏమైంది అన్న రెండు చిత్రాలపై ఆయన ప్రశంసలను కరిపించారు. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ రెండు సినిమాలను చూసిన దర్శకుడు రాజమౌళి తాజాగా ట్విట్టర్‌లో ప్రశంసించారు.   

విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి వంటి యువనటులు నటించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ఈరోజు విడుదలై కాగా, ఈ చిత్రం చాలా బాగుందని రాజమౌలి ట్వీట్ చేశారు. 'ఈ నగరానికి ఏమైంది' సినిమా యూనిట్ కి హృదయపూర్వక శుభాకాంక్షలని జక్కన్న అన్నారు. తరుణ్‌ భాస్కర్‌ మరోసారి తన దర్శకత్వ ప్రతిభను, తన కథాంశాన్ని ఎంచుకుని నిరూపించారన్నారు. ఇది  నవ్వులతో కూడుకున్న ఎంతో ప్రశాంతమైన సినిమా అని అన్నారు.

అలాగే, సుధీర్ బాబు, అదితీ రావు హైదరీ, నరేష్, తనికెళ్ల భరణి, పవిత్ర లోకేశ్, హరితేజ నటించిన సినిమా 'సమ్మోహనం' చిత్రాన్ని తాను అలస్యంగా చూశానని చెప్పారు. ఇవాలే ఈ చిత్రాన్ని కూడా చూశానని పేర్కోన్న జక్కన్న.. ఈ సినిమాను ప్రేక్షకులను పలు అంశాలలో అలోచింపజేసేదిలా వుందని అన్నారు. అదితి రావు హైదరి నటన ఎంతో నచ్చిందని అన్నారు. సుధీర్ బాబు కూడా చక్కగా చేశాడని కితాబిచ్చాడు. ఇక వెటరన్ నటుడు నరేశ్‌ పాత్రోచితంగా వినోదభరితంగా అభినయించి తన పాత్రకు న్యాయం చేశారని పేర్కొన్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tharun Bhascker  Sudheer Babu  SS Rajamouli  Sammohanam  Ee Nagaraniki Emaindi  tollywood  

Other Articles