Shocking! Plans to murder Prakash Raj revealed తన గళం మరింత పెరుగుతుందన్న ప్రకాష్ రాజ్

Prakash raj says killers will not get away with hate politics

prakash raj, gauri lankesh, plan to kill prakash raj, gauri lankesh killers, prakash raj news, south indian actor, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

According to the SIT findings, as reported by a Kannada news channel, Gauri's killers had conspired to kill Prakash Raj after he targeted Prime Minister Narendra Modi and the BJP on public platforms.

తన గళం మరింత పెరుగుతుందన్న ప్రకాష్ రాజ్

Posted: 06/27/2018 06:19 PM IST
Prakash raj says killers will not get away with hate politics

జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్‌ హత్య కేసులో శ్రీరామ సేనకు చెందిన వ్యక్తుల ప్రమేయం వుందన్న అనుమానాలు ఓ వైపు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆ హంతకులకు ఎట్టకేలకు సిట్ పట్టుకుని విచారిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ కన్నడ నటుడు గిరీష్ కన్నాడ్ పేరు కూడా హంతకుల జాబితాలో వుందన్న వార్తలు వచ్చాయి. అయనతో పాటు పలువురు ప్రముఖల పేర్లు కూడా వారి హిట్ లిస్టులో వున్నాయని ఇటీవల అధికారులు తెలుసుకున్నారు. కాగా, తాజాగా వారు ప్రముఖనటుడు.. జస్ట్ అస్కింగ్ పేరిట ప్రజల తరుపున ప్రభుత్వాలను నిలదీస్తున్న ప్రకాష్ రాజ్ ను కూడా హత్య చేసేందుకు కుట్రపన్నారని సిట్ అధికారులు దర్యాప్తులో వెల్లడైంది.

గౌరీ లంకేష్ హత్యానంతరం అమె మరణంపై ప్రధాని నరేంద్రమోడీ పెదవి విప్పాలని డిమాండ్ చేసిన ప్రకాష్ రాజ్. అమె హత్యలో పలువురు రాజకీయ నాయకుల హస్తం ఉందని కూడా గతంలో అరోపించారు. ఆమె హత్య కేసు దర్యాప్తు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అప్పట్లో ఈ విషయంపై ఆయన పలు రాజకీయ నాయకుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. గౌరీ లంకేష్‌ తనకు మంచి స్నేహితురాలని ప్రకాశ్‌రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె నిజాయతీగా ఉండేవారని, తన హత్య చాలా బాధించిందని ఆయన అన్నారు.

అయితే గౌరీ లంకేష్‌ హత్య కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఓ సంచలనమైన విషయాన్ని బయటపెట్టింది. దోషులు ప్రకాశ్ రాజ్ ను కూడా హత్య చేయాలని అనుకున్నట్లు చెప్పింది. ఈ వార్తల్ని కన్నడ మీడియా ప్రచురించింది. వాటిని చూసిన ప్రకాశ్‌రాజ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఇకపై తన గళం మరింత పెరుగుతుందని హెచ్చరించారు. ‘మీరు పిరికివాళ్లు.. విద్వేషపూరితమైన రాజకీయాల నుంచి మీరు తప్పించుకోగలరని అనుకుంటున్నారా?’ అని ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles