'Sanju' Has Everything Going For It To Open Huge భారీ విడుదలకు సన్నధమవుతున్న ‘సంజు’

Ranbir kapoor s sanju has the most promising advance booking of 2018

sanju, salman khan, rajkumar hirani, sanjay dutt, ranbir kapoor, sanjay dutt sanju, sanjay dutt biopic, ranbir kapoor in sanju, bollywood, movies, entertainment

Sanju is releasing on over 4000 screens across India. The advance booking for the film opened last Sunday, which is reportedly getting a fantastic response.

భారీ విడుదలకు సన్నధమవుతున్న ‘సంజు’

Posted: 06/27/2018 03:46 PM IST
Ranbir kapoor s sanju has the most promising advance booking of 2018

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘సంజూ’ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజున ఈసినిమా ఏకంగా 4,000 స్క్రీన్లపై ప్రదర్శితం కాబోతోందని సమాచారం. కేవలం ఒక్క భాషలో విడుదల అవుతున్న సినిమా ఇన్ని స్క్రీన్లపై విడుదల కావడం ఒక రికార్డే. రణ్‌బీర్ కపూర్ సంజయ్ దత్ గా నటించిన ఈ సినిమాను రాజ్ కుమార్ హిరాని రూపొందించారు. ఒక స్టార్ హీరో బయోపిక్ కావడం, అందునా సంజయ్ దత్ బయోపిక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇది వరకూ సంజయ్ దత్ తో పలు సినిమాలు రూపొందించిన దర్శకుడే రాజ్‌కుమార్ హిరాని. ఇక దర్శకుడిగా ఈయనకు అపజయం అంటూ లేదు. ఈ నేపథ్యంలో దత్ బయోపిక్ బాగుంటుందనే అంచనాలున్నాయి. ట్రైలర్ ఆ భరోసాను ఇస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో తొలి రోజు వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

జూన్ 29న అంటే..ఈ శుక్రవారం సంజూ విడుదల కాబోతోంది. తొలి రోజు వసూళ్లు భారీగా ఉంటాయని, తొలి వీకెండ్‌కు ఈ సినిమా గ్రాస్ వసూళ్లతో వంద కోట్ల రూపాయల మార్కును అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్‌లో రెండు వందల కోట్ల రూపాయల వరకూ వ్యాపారం చేసిందని టాక్. థియేటరికల్ హాక్కులను ఈ మొత్తానికి సేల్ చేశారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయల షేర్‌ను అలవోకగా వసూలు చేయగలదనే అంచనాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanju  rajkumar hirani  sanjay dutt  ranbir kapoor  sanjay dutt biopic  bollywood  

Other Articles

Today on Telugu Wishesh