బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం సంజు. ఇందులో ఆయన జీవితంలో ఎదుర్కొన్న పలు ఘటనలను పొందుపర్చారు దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ. రీల్ లైఫ్ సంజయ్ పాత్రలో రణ్బీర్ కపూర్ నటించారు. ఈ చిత్రానికి ‘సంజు’ అనే టైటిల్ ను ఖరారు చేసిన చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహలు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇవాళ అధికారికంగా ట్రైలర్ను విడుదల చేశారు.
ట్రైలర్లో సంజయ్ గా రణ్బీర్ తన గురించి తాను చెప్పుకొంటూ..‘గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్. ఈరోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు. ఎందుకంటే నా ఆత్మకథ మీ ముందుకు రాబోతోంది. బయోపిక్ తీసేంత వెరైటీ లైఫ్ ఎవరికి దొరుకుతుంది చెప్పండి. ఎందుకంటే నేనొక పోకిరిని, డ్రగ్స్ కి అలవాటు పడినవాడిని. కానీ ఉగ్రవాదిని మాత్రం కాదు.’ అని చెప్పడం హైలైట్ గా నిలిచింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో రణ్ బీర్ ను అరెస్ట్ చేసిన దృశ్యంలో ఓ పోలీసు అధికారి ‘నీ వద్ద ఏకే 47 ఉందా?’ అని అడుగుతాడు. ఇందుకు రణ్ బీర్ ‘లేదు సర్’ అంటాడు. దాంతో ఆ పోలీసు అతని చెంప చెల్లుమనిపిస్తాడు. అప్పుడు రణ్ బీర్ జరిగిన దంతా చెప్తానంటాడు.
‘నేను మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాను. ఓసారి నాన్నపై కోపంతో డ్రగ్స్ తీసుకున్నాను. మరోసారి అమ్మకు ఆరోగ్యం బాలేకపోవడంతో బాధతో తీసుకున్నాను. మూడోసారి పూర్తిగా మాదకద్రవ్యాలకు బానిసనైపోయాను’ అని ఫన్నీగా చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ఇందులో సోనమ్ కపూర్ సంజయ్ మొదటి భార్యగా నటించారు. రణ్ బీర్ మాదకద్రవ్యాలకు అలవాటుపడి సోనమ్ మంగళసూత్రాన్ని అమ్మేస్తాడు. దాంతో సోనమ్ ఏడ్చుకుంటూ ‘నా మంగళసూత్రం ఎక్కడ’ అని అడిగితే.. రణ్ బీర్ టాయ్ లెట్ సీట్ ను సోనమ్ మెడలో వేయడం ఫన్నీగా ఉంది.
అక్రమ ఆయుధాల కేసులో సంజయ్ జైలుకు వెళ్లినప్పుడు అక్కడ అతను పడిన బాధలను కళ్లకు కట్టినట్లు ఈ ట్రైలర్లో చూపించారు. సంజయ్ జీవితంలో ఎదుర్కోన్న కష్టాలు, అయనకు ఎదురైన నష్టాలను చిత్రంలో దర్శకుడు సగటు ప్రేక్షకుడి ముందుంచే ప్రయత్నం సఫలీకృతం అయినట్లుగా కనిపిస్తుంది. జైలు జీవితం ఎంతటి దుర్భరమో ఈ చిత్రంలో చూపాడు దర్శకుడు. సంజయ్ పాత్రలో రణ్ బీర్ ఒదిగిపోయారనే చెప్పాలి. సంజయ్ తండ్రి పాత్రలో పరేశ్ రావల్ నటించారు. రెండో భార్య మాన్యత పాత్రలో దియా మీర్జా నటించారు. అనుష్క శర్మ చిన్న పాత్రలో మెరిశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more