latest updates of prabhas sahoo revealed by actor ప్రబాస్ సాహో సినిమా తాజా అప్ డేట్స్..

Latest updates of prabhas sahoo revealed by actor

prabhas, shradha kapoor, lal, neil nithin, updates, sahoo, europe shedule, Baahubali franchise, movies, entertainment, tollywood

Sahoo the nest project of young rebel star prabhas after he got international recognistion with rajamoulis bahubali, had high expectations from fans, here are the latest updates of the film revealed by co-actor

ప్రబాస్ సాహో చిత్రానికి సంబంధించి అసక్తికర అప్ డేట్స్..

Posted: 05/28/2018 07:32 PM IST
Latest updates of prabhas sahoo revealed by actor

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌.. సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సాహో’ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం గురించి మరో అసక్తికర అప్ డేట్ ప్రబాస్ అభిమానులలో అసక్తి రేపుతుంది. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. తొలుత 2018లో అనుకున్నా.. చిత్రం నిర్మణం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర నిర్మాణవర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, మలయాళ నటుడు, దర్శకుడు లాల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రభాస్ కు గుర్తింపు తెచ్చిన బ్లాక్ బస్టర్ ‘బాహుబలి’ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది కావడంతో దీనిపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి సంబంధించిన టీజర్ విడుదలైన క్రమంలోనే అంచనాలు అంతకంతకూ ఎగబాకుతున్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు ఇటీవలే అబుదాబి, దుబాయ్ దేశాల్లో జరిగాయి.

ఈ యాక్షన్ సన్నివేశాలు కూడా హాలీవుడ్‌ స్థాయిని తలపించేలా వున్నాయన్న టాక్ రావడంతో చిత్ర అంచనాలు అందనంత ఎత్తకు వెళ్తున్నాయి. అయితే ‘సాహో’ చిత్రం గురించి లేటెస్టుగా అప్ డేట్స్ అందాయి అవేంటంటే.. చిత్ర దర్శకుడు సుజీత్ ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి కథను ఎవరితోనూ రివీల్ చేయలేదని చెప్పారు. ఇక ఈ చిత్ర నిర్మాణం ఇంకా చాలా వుందని కూడా అప్ డేట్ అందించింది. ఇది సింపుల్ కథ కాదని కూడా ఆయన చెప్పారు. కథ పూర్తిగా విదేశాల్లోనే సాగుతుందని, ఇంకా యూరోప్ షెడ్యూల్ కూడా వుందన్న అప్ డేట్ కూడా లభించింది.

ఈ అప్ డేట్ ఇచ్చింది మరెవరో కాదు ఈ చిత్రంలో భాగమైన మళయాల చిత్ర నటుడు, దర్శకుడు లాల్. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సాహో చిత్రంలో హీరోగా నటిస్తుంది ప్రభాస్‌ అని తనకు ముందుగా తెలియదని లాల్‌ అన్నారు. ఇందులో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ‘గత ఏడాది దర్శకుడు సుజీత్‌ నాకు ఫోన్‌ చేసి, తెలుగు సినిమా గురించి మాట్లాడాలి అన్నారు. అప్పుడు ఇందులో ప్రభాస్‌ హీరో అని తెలియదు. ఓ తెలుగు సినిమాను ఎంచుకునేంత నేర్పు నాకు లేదు.. నా పాత్ర నచ్చిందని ఓకే చేశా’.

‘మలయాళీ ఆర్టిస్టులను ప్రభాస్‌ బాగా గౌరవిస్తారు. అది నాకు అతడిలో బాగా నచ్చింది. మలయాళీయులు అతి తక్కువగా తెలుగు సినిమాలు చూస్తుంటారు. కానీ తెలుగు వారు మా సినిమాల్ని బాగా చూస్తారు. కొంత మంది సహాయ దర్శకులు మా కుటుంబ సభ్యులు చూడని నా సినిమాల్లోని సన్నివేశాల గురించి కూడా నాతో మాట్లాడారు’. ‘‘సాహో’ సినిమాలో నా పాత్ర పాజిటీవ్ గా ఉంటుందని లాల్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles