Mahanati Runtime Locked మహానటి టీమ్ నుంచి ‘తీపి’కానుకలు..!

Prakash raj s character in savitri biopic mahanati revealed

keerthi suresh, nag ashwin, samantha, vijay devarakonda, rajendra prasad, prakash raj, savitri, mahanati, invitation letter, sweet box, tollywood, movies, entertainment

The film's promotions are bringing huge buzz on the film. The makers have distributed specially made cashew sweet box to the industry people and film journos. And it has a Savitri connection to it.

మహానటి టీమ్ నుంచి ‘తీపి’కానుకలు..!

Posted: 05/08/2018 04:27 PM IST
Prakash raj s character in savitri biopic mahanati revealed

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' సినిమా ఈ నెల 9న బుధవారం విడుదలకు సిద్దమైంది. తెలుగు చలనచిత్ర రంగానికి తీపికానుకగా మిగిలిన మహానటి సావిత్రి.. బయోపిక్ చిత్రం విడుదల అవుతున్న క్రమంలో చిత్ర నిర్మాణ వర్గాలు కూడా వినూత్నంగా ఆలోచించి.. చక్కని అహ్వానాలను సిద్దం చేసింది. సావిత్రి జీవిత విశేషాలు.. బలమైన తారాగణం.. ప్రధానమైన ఆకర్షణగా నిలిచిన నేపథ్యంలో చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని చిత్రనిర్మాణ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా థియేటర్లకు వస్తుందనీ, వచ్చి చూసి ఈ సెలబ్రేషన్ లో భాగస్వాములు కావాలని సినీ ప్రముఖులకు చిత్ర నిర్మాణ వర్గాల నుంచి ఆహ్వాన పత్రికలు పంపించినట్టుగా తెలుస్తోంది.

అయితే సాధారణంగా కేవలం ఒక అహ్వాన పత్రికను ప్రముఖులకు పంపితే సముచితంగా వుండదని అలోచించిన చిత్ర నిర్మాణ సంస్థ.. జీడిపప్పు మిఠాయితో కూడిన బాక్స్ తో పాటు ఆహ్వాన పత్రికలను పంపించడం విశేషం. అలాంటి ఆహ్వాన పత్రికను అందుకున్న 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, ఈ సినిమా టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తానికి పెద్దగా హడావిడి చేయకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేసిన దర్శక నిర్మాతలు, విడుదల తేదీ నాటికి ప్రమోషన్స్ ను పతాకస్థాయికి తీసుకొచ్చి అంచనాలు పెంచేయడం విశేషం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : savitri  mahanati  invitation letter  sweet box  tollywood  movies  entertainment  

Other Articles