Chiru reveals his favorite scene from BAN చిరంజీవి చేత చప్పట్లు కోట్టించిన సీన్ అదే..

Chiru reveals his favorite scene from bharat anu nenu

Bharat anu nenu, chiranjeevi, mahesh babu, koratala siva, United Nation, press meet scene, movies, tollywood, entertainment

A couple of days ago already director Koratala Siva and producer DVV Danayya felt happy to share that Megastar Chiranjeevi called them and appreciated for Bharat Anu Nenu.

ఆ సీన్ కు నేను ఎంతగానో కనెక్ట్ అయిపోయా: చిరంజీవి

Posted: 05/02/2018 05:43 PM IST
Chiru reveals his favorite scene from bharat anu nenu

ప్రేక్షకుల అభిమానాన్ని చూరగోన్న ప్రిన్స్ మహేశ్ బాబు తాజాగా తాను నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలోని ఓ సన్నివేశంలో మెగాస్టార్‌ చిరంజీవి చేత కూడా చప్పట్లు కొట్టించారు. ఇదివరకే ఈ చిత్రంపై  చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించి అభినందించారని చిత్ర.దర్శకుడు కొరటాల శివ చెప్పగా, తాజాగా స్వయంగా చిరంజీవే ఈ వివరాలను వెల్లడించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా అమెరికా వెళ్లిన చిరంజీవి... అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘భరత్‌ అనే నేను’ సినిమా గురించి కూడా ముచ్చటిస్తూ ఈ చిత్రంలో తనకు బాగా నచ్చిన సీన్ గురించి కూడా చెప్పారు.

‘మా కుటుంబ సభ్యులకు మహేశ్ బాబు అంటే చాలా ఇష్టం. ‘భరత్‌ అనే నేను’ను తొలిరోజున మా ఇంట్లోనే చూశాం. కమర్షియల్‌ హంగుల కోసం దర్శక, నిర్మాతలు సినిమాను కలుషితం చేయలేదు. మహేశ్ కు ఫోన్‌ చేసి నటన అద్భుతంగా ఉందని మెచ్చుకున్నా. ఈ సినిమా ద్వారా సూపర్ సందేశం ఇచ్చారు’. ‘ప్రత్యేకించి సినిమా చివర్లో వచ్చే విలేకరుల సమావేశం సన్నివేశం అమేజింగ్‌గా ఉంది. నేను స్వతహాగా ఆ సన్నివేశానికి కనెక్ట్ అయిపోయి.. మహేశ్ జర్నలిస్టులను ప్రశ్నిస్తున్నప్పుడు చప్పట్లు కొట్టా. సినిమాలో అది అత్యద్భుతమైన సన్నివేశం’ అని చిరు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat anu nenu  chiranjeevi  mahesh babu  koratala siva  press meet scene  movies  tollywood  entertainment  

Other Articles