Teja quits from NTR biopic ‘ఎన్టీఆర్’ దర్శకత్వ బాధ్యతలు ఆయనకే..

Director teja quits from bala krishna s ntr biopic

ntr biopic, teja, raghavender rao, bala krishna, bramha teja productions, ntr fan teja, Telugu movie news, Telugu cinema stills, Telugu movie reviews, Telugu cinema reviews, Telugu movie reviews, Telugu actress stills, Telugu cinema wallpapers, Telugu movie HQ photos, Telugu actress hot stills, tollywood, Telugu movies updates, Telugu movie trailersm tollywood, kollywood, movies, entertainment

remowned director teja who had already scripted NTR biopic and kickstarted the muhoortam shot, quits from the project, saying he as a fan of ntr may not do the justice for the movie.

‘ఎన్టీఆర్’ దర్శకత్వ బాధ్యతలు ఆయనకేనా.?

Posted: 04/25/2018 09:45 PM IST
Director teja quits from bala krishna s ntr biopic

నట సార్వభౌముడు, స్వర్గీయ ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్‌’ సినిమా నుంచి దర్శకుడు తేజ వైదొలిగారు. ఎన్టీఆర్ కు వీరాభిమానిగా వున్న తాను ఈ చిత్రానికి న్యాయం చేయలేనని పేర్కొంటూ ఆయన ఈ చిత్రం నుంచి వైదోలిగినట్లు పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వం బాధ్యతను ఎవరు చేపడతారా.? అని చర్చకు దారితీస్తుంది.

బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయనే సొంతంగా బ్రహ్మతేజ ప్రోడక్షన్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి మరీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రామకృష్ణ స్టూడియోలో సినిమా షూటింగ్‌ ప్రారంభమైన ఈ చిత్ర రూపోందించే బాద్యతలు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు అప్పగించే అవకాశాలు వున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్‌ అనేక మంది సినీ తారలతో కలిసి వెండితెరను పంచుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆయా పాత్రల్లో ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇంకా నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి కానట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ను నిర్మాతలు సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆమె ఒప్పుకున్నారో.. లేదో తెలియాల్సి ఉంది. జయలలిత పాత్రలో కాజల్‌ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. వీటిపై కాజల్‌ స్పందిస్తూ.. తను నటించడం లేదని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntr biopic  teja  raghavender rao  bala krishna  tollywood  kollywood  movies  entertainment  

Other Articles