Manchu Vishnu about Bike Accident మంచు విష్ణుకు రోడ్డు ప్రమాదం..

Manchu vishnu about bike accident in movie achari america yatra

Manchu Vishnu,Manchu Vishnu about Bike Accident,Manchu Vishnu Accident,Manchu Vishnu Speech,Manchu Vishnu about Pragya Jaiswal,Pragya Jaiswal,Pragya Jaiswal Movies,Pragya Jaiswal Speech,VV Vinayak,VV Vinayak Speech,Raghavendra Rao,Raghavendra Rao Speech,Brahmanandam,Brahmanandam Speech,Achari America Yatra,Achari America Yatra Pre Release Event,Achari America Yatra Trailers,Achari America Yatra Movie Songs,Achari America Yatra latest Trailers,Filmy focus, tollywood, kollywood, movies, entertainment

Tollywood actor manchu vishnu emotional about Bike Accident @Achari America Yatra Movie Pre Release Event shared a video on social media.

హీరోలంటే ఈజీ కాదు.. మంచువిష్ణు వీడియోనే సాక్ష్యం

Posted: 04/25/2018 06:54 PM IST
Manchu vishnu about bike accident in movie achari america yatra

సినీమా హీరోలంటే ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని అంటుంటారు. ఒకసారి వచ్చి మా కష్టాలు చూస్తే అర్థమవుతుంది హీరోలుగా చేయడం ఎంత కష్టమో అంటూ ఇటీవల తెలుగు సినిమా హీరోలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఆ మాటలు అప్పడు వింటే సర్లే అనేవాళ్లు ఇప్పుడు ఈ వీడియో చూస్తే మాత్రం అవునవును అనక తప్పదు. ఎందుకంటే సినిమా షూటింగుల్లో ఎన్నో ప్రమాదాలకు కూడా గురవుతుంటారు. ఓ వైపు హీరోగా కనిపించేందుకు ప్రతినిత్యం బాడీని ఫిట్ గా వుంచుకోవాలి. మరోవైపు అనూహ్యంగా ఎదురయ్యే ప్రమాదాలు. నిజమే మరి హీరోలంటే మజాకు కాదు అనాల్సిందే.

ఇంకా సాక్ష్యం కావాలంటే హీరో మంచు విష్ణు, హీరోయిన్ ప్రజ్ఞా జశ్వాల్ లకు ఎదురైన ప్రమాదమే ఇందుకు సాక్ష్యం. అచారి అమెరికా యాత్ర సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా జరిగిన షూటింగ్ లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా ఓ యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ సమయంలో విష్ణు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడ్డారు. కాలికి, భుజానికి గాయాలయ్యాయి. ఆయన వెనుక కూర్చున్న ప్రగ్యాకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

కాగా ఈ షూట్‌కు సంబంధించిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. దీన్ని విష్ణు ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘స్టంట్స్‌ ఎల్లప్పుడూ సురక్షితంగా జరగవు. టైం బాగాలేకపోయి ఉంటే తలకు తీవ్ర గాయాలు అయ్యేవి’ అని ట్వీట్‌ చేశారు. పక్కన వెళ్తున్న బైక్‌.. విష్ణు బైక్‌పై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. పద్మజా పిక్చర్స్‌ పతాకంపై కీర్తి, కిట్టు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న చిత్రం విడుదల కానుంది. కాగా, మంచు విష్ణుకు గాయమైన వీడియోను ఓ సారి చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles