Venky Next With Bhaagamathie Director | వెంకీ నెక్స్ట్.. ఓకే అన్నా.. అనకపోయినా ఫర్వాలేదు

Venky next director fixed

Venkatesh Daggubati, Bhaagamathie Director, G Ashok, Venky Director Ashok, Director Ashok Venky Movie

Venkatesh Daggubati next with Bhaagamathie Director, Ashok writes a Story.

భాగమతి దర్శకుడితో వెంకీ సినిమా?

Posted: 02/12/2018 04:34 PM IST
Venky next director fixed

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తేజ సినిమా సంగ్ధిగ్ధం కొనసాగుతున్న వేళ.. మరో ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. పిల్ల జమీందార్, సుకుమారుడు దర్శకుడు అశోక్ ఈ మధ్యే భాగమతితో బిగ్ హిట్ సాధించిన విషయం తెలిసిదే.

ఈ నేపథ్యంలో అశోక్ తర్వాతి చిత్రం వెంకీతో ఉంటుందనే సంకేతాలు అందుతున్నాయి. నిజానికి గతంలోనే ఓ చిత్రం వెంకీతోనే ఇతగాడు తీయాల్సి ఉంది. కానీ, సురేష్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి మళ్లీ ఎలాంటి సంకేతాలు అందకపోవటంతో భాగమతి పై ఫోకస్ పెట్టాడు. అయితే ఇప్పుడు భాగమతి రిజల్ట్ తో అతగాడికి మళ్లీ సురేష్ బాబు నుంచి పిలుపు అందిందంట.

అయితే ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. పాత కథతోనే వెళ్తాడా? లేక కొత్త స్టోరీ లైన్ వినిపించాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వెంకీ గనుక ఈ ప్రాజెక్టును హోల్డ్ లో పెడితే మరో యంగ్ హీరో కోసం అల్రెడీ కథను రెడీ చేసుకుని ఉన్నట్ల తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles