Megastar Unhappy Over Twitter threat to Quit | ట్విటర్ పై అమితాబ్ ఆగ్రహం..

Big b angry on twitter

Amitabh Bachchan, Twitter Followers, Big B Twitter, Big B Quit Twitter, Amitabh Bachchan Sharukh Khan Twitter Followers, Big B Unhappy Twitter, Big B Quit Twitter

The Curious Case of Amitabh Bachchan Losing Followers on Twitter. Amitabh Bachchan is losing followers and he is very, very upset.Warns to quit Twitter.

ట్విటర్ తీరుతో బిగ్ బీకి మండింది

Posted: 02/01/2018 03:29 PM IST
Big b angry on twitter

సెలబ్రిటీల ఫాలోయింగ్ ను బట్టే వారి క్రేజ్ ఎంత ఉంటుందో ఓ అంచనా వేసుకోవచ్చు. అందుకే ఈ తరం తారలంతా ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఈ తరం మాత్రమే కాదు.. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు కూడా ఇందులో యాక్టివ్ గా ఉన్నారు.

అమితాబ్ ను ట్విట్టర్ లో ఫాలో అయ్యే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. 3 కోట్ల 29 లక్షల 2 వేల మందికి పైగా ఆయనను ఫాలో అవుతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఆ రికార్డు బద్ధలు కొట్టాడని.. షారూఖ్ ఖాతాలో 3 కోట్ల 29 లక్షల 44 వేల మంది ఉన్నారంటూ ట్విటర్ వెల్లడించింది. దీంతో బిగ్ బీకి కాలిపోయింది.

ట్విట్టర్ పెద్ద జోక్ అని... తన ఫాలోయర్ల సంఖ్యను ట్విట్టర్ తగ్గించిందని ఆయన వ్యాఖ్యానించారు. ట్విటర్ కు గుడ్ బై చెప్పాల్సిన టైమొచ్చిందంటూ ట్వీట్ వేయటంతో ఆయన సోషల్ మీడియాలో ఇకపై క్రియాశీలకంగా ఉండరేమోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles