Talented Beauty Confirmed for Senior Hero Next | సీనియర్ హీరోతో రొమాన్స్ కు నివేదా రెడీ!

Heroine for vaitla ravi teja movie

Nivedha Thomas, Ravi Teja, Srinu Vaitla, Amar Akbar Anthony, Ravi Teja Nivedha Thomas, Vaitla-Ravi Teja Movie, Nivedha Thomas Next Movies, Nivedha Thomas 2018

Nivedha Thomas Confirmed for Ravi Teja and Srinu Vaitla Movie. Amar Akbar Anthony title consider and Maa Raja plays three different shades role.

శీనువైట్ల-రవితేజ.. హీరోయిన్ దొరికింది

Posted: 01/30/2018 03:45 PM IST
Heroine for vaitla ravi teja movie

తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న మల్లూ బ్యూటీస్ లో నివేదా థామస్ పేరు కూడా వినిపిస్తుంది. 'జెంటిల్ మ్యాన్' సినిమాతో పరిచయమైన నివేదా .. వరుసగా క్రేజీస్టార్లతో జోడీ కట్టింది. గతేడాది 'నిన్ను కోరి', 'జై లవ కుశ' సినిమాలతో విజయాలు అందుకుంది. అయితే, 'జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌' మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.

క్రేజ్ ఉన్నా సినిమాలు ఒప్పుకోకుండా కాస్త గ్యాప్ తీసుకుంటుందనే ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఓ యంగ్ హీరో(శర్వానంద్ పేరు వినిపిస్తోంది) ఓ సినిమాతోపాటు మరో హీరోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. మాస్ రాజా రవితేజతో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. శ్రీను వైట్లతో రవితేజ చేసే సినిమాలో ఆమె ఛాన్స్ దక్కించుకోగలిగిందని చెబుతున్నారు. నిజానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ చేస్తోన్న 'నేల టికెట్' సినిమాలోనే నివేదాకు ఛాన్స్ దక్కాలి. కానీ, ఎందుకనో అది మిస్సయ్యింది. ఇప్పుడు వైట్ల సినిమాతో మళ్లీ ఛాన్స్ దక్కింది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'అమర్ అక్బర్ అంథోని' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. రవితేజ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతుండగా.. సునీల్ తిరిగి ఇందులో కమెడియన్ గా కనిపించబోతున్నాడు. రవితేజ - శ్రీను వైట్ల ట్రాక్ రికార్డు మూలంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nivedha Thomas  Ravi Teja  నివేదా థామస్  రవి తేజ  

Other Articles