RGV Satire to Activist Devi after GST Success | ఏవండోయ్ దేవి గారూ.. అంటూ వర్మ సెటైర్

Rgv on gst part 2

Ram Gopal Varma, GST, Mia Malkova, Activist Devi, RGV Devi, RGV GST2

Ram Gopal Varma Announces GST Sequel. After GST Success RGV Satire to Activist Devi. RGV plans to GST 2 and announced officially.

దేవి గారూ.. వింటున్నారా? జీఎస్టీ-2 తీస్తా : వర్మ

Posted: 01/30/2018 03:15 PM IST
Rgv on gst part 2

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' లఘు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పోర్ట్ స్టార్ మియా మల్కోవా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ వీడియో విడుదలకు ముందే ఈ సినిమా పెద్ద దుమారాన్ని లేపింది. మహిళా సంఘాలు దీనిపై విరుచుకుపడ్డాయి. సామాజిక కార్యకర్త దేవి కూడా ఈ సినిమాపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, ఆమెపై వర్మ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయనపై దేవి పోలీస్ కేసు కూడా పెట్టారు.

ఇవన్నీ పక్కనపెడితే... ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్ లో వర్మ ఓ పోల్ నిర్వహించారు. "జీఎస్టీి ఇన్ స్పైడర్ లో మీరు నాతో కలవగలరా? 'ఐ లవ్ సెక్స్ టూ'కు క్యాంపెయిన్ చేయగలరా?" అంటూ సర్వే నిర్వహించారు. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ, లక్ష మందికిపైగా ఈ పోల్ లో పాల్గొన్నారని... 73 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారని చెప్పారు. అంతేకాదు, 'దేవి గారూ, వింటున్నారా' అంటూ ఆమెను ఉద్దేశించి సెటైరిక్ గా కామెంట్ చేశారు.

 

ఇక ఎవరెన్ని విమ‌ర్శ‌లు చేసినా శృంగార‌మే ప్ర‌ధానాశంగా సినిమా తీసిన వర్మ.. దానికి కొనసాగింపు ఇవ్వబోతున్నాడు. జీఎస్టీ-2 తీస్తానని ప్రకటించి మరో కలకలం రేపారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించిన ‘జీఎస్టీ’కి వస్తున్న అద్భుతమైన స్పందన చూశాక జీఎస్టీ- 2ని వెంటనే ప్రారంభించాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఆ భగవంతుడు, తన జీఎస్టీ లవర్స్ మద్దతు తెలుపుతారని తాను నమ్ముతున్నానని వర్మ నిన్నసాయంత్రం ఓ ట్వీట్ చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles