Sam Confirmed Lead in U Turn Remake | మనసు మార్చుకున్న సమంత

Samnatha confirmed in u turn

Samantha Akkineni, U Turn Movie, Lead Role, Samantha U Turn, Samantha as Producer, Samantha Lead U Turn Remake, U Turn Telugu Tamil Remake

Actress Samantha Confirmed lead in Tamil and Telugu remake of 'U Turn'. In Previously she watched the Kannada film in a special screening in Bengaluru and Immediately gave her nod.

యూ టర్న్ లో సమంతే హీరోయిన్

Posted: 01/24/2018 04:05 PM IST
Samnatha confirmed in u turn

అక్కినేని వారి పెద్ద కోడలు సమంత పెళ్లి చేసుకున్నాక.. దూకుడు పెంచేసింది. సెలక్టివ్ పాత్రలతో సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. తమిళ్ లో విశాల్, విజయ్ సేతుపతితో నటిస్తున్న సమంత.. తెలుగులో రామ్ చరణ్ సరసన రంగస్థలం... మహానటిలో చేస్తోంది.

ఇదిగో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు ఆమె ఖాతాలో పడింది. కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా యూ టర్న్. అదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఆ సినిమాను చూసిన సమంత దానిని తమిళ - తెలుగులో తీయాలని అనుకుంది. తొలుత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాలనుకుంది. అయితే అందులో లీడ్ పాత్ర ఆమెను ఆకట్టుకోవటంతో ఇప్పుడు తానే నటించాలని నిర్ణయించుకుంది.

యూటర్న్ సినిమా వుమెన్ ఓరియంటెడ్ సినిమా. ఇంతవరకు సామ్ గ్లామర్ డాల్ గా నటించిందే తప్ప.. ఇలాంటి సినిమాలో నటించలేదు. అనుష్కకు అరుంధతి లాగా సమంతకు యూటర్న్ కూడా ప్రత్యేక గుర్తింపు తెస్తుందేమో చూడాలి. మొత్తానికి ఇంతవరకు చేయని రోల్ లో సామ్ ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అయిపోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  U Turn Movie  సమంత  యూ టర్న్ చిత్రం  

Other Articles