Anushka Bhaagamathie Censor Works Done | భాగమతి సెన్సార్ టాక్.. అనుష్క నట విశ్వరూపం.. థమన్ మ్యూజిక్!

Bhaagamathie censor done

Bhaagamathie, Anushka Shetty, Censor Report, Director Ashok, SS Thaman, Bhaagamathie Censor Report

Anushka Shetty's Bhaagamathie Censor Completed. The Film got U/A Cerificates with Few Cuts. According to Censor report Anushka Acting and Thaman Music highlights for this Horror Drama.

అనుష్క భాగమతి సెన్సార్ పూర్తి

Posted: 01/18/2018 04:04 PM IST
Bhaagamathie censor done

అనుష్క అభిమానులంతా కూడా ఆమె తాజా చిత్రం 'భాగమతి' కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టీజర్లో చూపించిన దృశ్యాలు .. అనుష్క రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించడం వాళ్లలో ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

142 నిమిషాల రన్ టైంతో సెన్సార్ బోర్డు భాగమతికి యు/ఎ సర్టిఫికేట్ ను ఇచ్చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో మళయాళ నటులు ఉన్ని ముకుందన్, జయరామ్ లతోపాటు ఆశా శరత్ .. ఆది పినిశెట్టి ముఖ్యమైన పాత్రలను పోషించారు. అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వాళ్లు భారీగా నిర్మించారు.

ఇక సెన్సార్ రిపోర్టు ప్రకారం.. అనుష్క నటన చిత్రానికే హైలెట్ గా నిలిచిందంట. దీనికి తోడు తమన్ అందించిన సంగీతం.. అటు పాటల పరంగా.. ఇటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో విడుదల కానుంది.

Bhaagmathei Censor Certificate

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles