Kapoor Heroine Plans Secret Wed with Boy Friend | అనుష్క రూట్ లోనే సోనమ్ కూడానా?

Sonam kapoor ready for secret wedding

Sonam Kapoor, Anand Ahuja, Secret Wedding, Jodhpur, Virushka, Sonam Anushka Sharma,

Lovebirds Sonam Kapoor and Anand Ahuja to tie the knot in Jodhpur this April. Buzz has it that Sonam Kapoor and Anand Ahuja are ready to take their relationship to the next level.

రహస్య వివాహానికి రెడీ అయిన సోనమ్?

Posted: 01/06/2018 04:03 PM IST
Sonam kapoor ready for secret wedding

విరుష్కల వివాహం తర్వాత బాలీవుడ్ లో ఇప్పుడు మరో సెలబ్రిటీ వివాహం గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సీనియర్ నటుడు అనిల్ కపూర్ తనయ, నటి సోన‌మ్ క‌పూర్ గత కొంత కాలంగా ప్రేమలో ఉందని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఆనంద్ అహూజాతో సన్నిహితంగా మెదులుతుండటం.. ఆ వార్తలను ఆమె తీవ్రంగా ఖండించిన విష‌యం తెలిసిందే.

కానీ, వారిద్దరి మధ్య బంధం మాత్రం చాలా గట్టిదేనన్న ఉద్దేశంతో బాలీవుడ్ మీడియా ఉంది. వారిద్ద‌రూ క‌లిసి క్రిస్‌మ‌స్‌, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌కు హాజ‌రుకావ‌డం, ఇత‌ర వేడుక‌ల‌కు వెళ్లిన‌పుడు కూడా వాళ్ల మధ్య కచ్చితంగా ప్రేమ చిగురించిందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇటీవ‌ల వారిద్ద‌రి ఫొటోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా షేర్ కూడా చేస్తున్నారు. దీంతో త్వ‌ర‌లో వాళ్లిద్ద‌రూ వివాహం చేసుకోబోతున్నార‌ని కొత్త‌గా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు దీనికి అదనంగా మరో వార్త జత చేరింది.

ఏప్రిల్‌లో జోధ్‌పూర్‌లో వివాహం జ‌ర‌గ‌నుందని, అతికొద్ది మంది బంధువుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌రగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తను సోన‌మ్‌, అహూజాల స‌న్నిహితులు ఖండిస్తున్నారు. జోధ్‌పూర్‌లో జ‌ర‌గ‌బోయే వివాహం సోనమ్ క‌జిన్ మోహిత్ మార్వాద‌ని, అంద‌రూ క‌లిసి ప‌నిచేస్తుండ‌టంతో సోన‌మ్‌ పెళ్లిగా అంద‌రూ భ్ర‌మ‌ప‌డుతున్నార‌ని వారు చెబుతున్నారు. అయితే విరుష్కల మాదిరిగా వీరిద్దరూ మీడియా దృష్టిని మళ్లీస్తున్నారన్నది మీడియా మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles