Ram Charan Next With Boyapati Shelved | బోయపాటి-చెర్రీ.. ఏందీ రచ్చ?

Charan boyapati movie no more

Ram Charan, Boyapati Srinu, RC12 Movie, Cherry Boyapati Movie, Ram Charan Premalayam Remake, RC 12 Boyapati

Ram Charan doing a film under the direction of hit director Boyapati Srinu. As per latest rumours the project shelved due to unknown reasons. But, Not Officially Confirmed yet.

చెర్రీ-బోయపాటి సినిమా.. రూమర్లు

Posted: 01/05/2018 07:13 PM IST
Charan boyapati movie no more

ప్రస్తుతం చరణ్ .. సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి సినిమాపై ఆయన అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. చరణ్ తదుపరి సినిమా బోయపాటి దర్శకత్వంలో వుండనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఓ మాస్ కథాంశంతో బోయపాటి కసరత్తు చేస్తున్నట్టుగా కూడా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా హిందీలో వచ్చిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాకి రీమేక్ అనే ప్రచారం మొదలైంది. అదేం కాదనే టాక్ కూడా బలంగానే వినిపించింది. అయితే ఈ ప్రచారాన్ని గురించి అటు చరణ్ గానీ .. ఇటు బోయపాటి టీమ్ గాని స్పందించలేదు. ఇక ఇప్పుడు ఏకంగా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందనేది ఫిల్మ్ నగర్లో కొత్తగా హల్ చల్ చేస్తోన్న రూమర్.

కారణమేమిటనేది తెలియడం లేదు గానీ, ప్రాజెక్టు మాత్రం క్యాన్సిల్ అయిందని అంటున్నారు. జోరుగా షికారు చేస్తోన్న ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి. ఇకనైనా చెర్రీ, బోయపాటి, లేదా నిర్మాత దానయ్య... ఎవరో ఒకరు స్పందిస్తేనే ఈ రూమర్లకు పుల్ స్టాప్ పడేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles