Nayanthara Not walked out of Sye Raa | సైరా నుంచి నయన్ అవుట్.. మేకర్లు ఏం చెబుతున్నారంటే...

Nayanatara in sye raa

Sye Raa Narasimha Reddy, Nayanatara, Chiranjeevi, Sye Raa Makers, Nayantara Chiranjeevi, Nayanatara Rumours

Sye Raa Narasimha Reddy Makers clarify that Nayanthara not walked out of Megastar's Movie. First Unit shooting action scenes later only Nayan joined shooting.

సైరాలో నయనతార ఉంది : చిత్ర యూనిట్

Posted: 12/30/2017 04:25 PM IST
Nayanatara in sye raa

చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, తాజాగా ఒక షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. అయితే చిత్రం అనౌన్స్ చేసే సమయంలో ఈ సినిమాలో కథానాయికగా నయనతార పేరును ప్రకటించడం జరిగింది.

కానీ, ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ మొదలు కాకపోవడం వలన, నయనతార డేట్స్ ను సర్దుబాటు చేయలేకపోతోందనే టాక్ బయటికి వచ్చింది. ఆమె కారణంగానే రెండవ షెడ్యూల్ ఇంకా మొదలు కాలేదనీ, మరో హీరోయిన్ ను తీసుకునే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదనేది తాజా సమాచారం.

కానీ, అదంతా రూమర్ అనే చిత్ర యూనిట్ సమాచారం అందించింది. నయనతార ముందుగా ఇచ్చిన డేట్స్ ప్రకారమే ఆమె ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి రానుందని అంటున్నారు. ముందు యాక్షన్ షెడ్యూల్స్ ను కానిచ్చేసి ఆ తర్వాతే చిరంజీవి .. నయనతార కాంబినేషన్లోని సన్నివేశాలను ఫిబ్రవరిలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ .. జగపతిబాబు .. విజయ్ సేతుపతి .. సుదీప్ ముఖ్యమైన పాత్రలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles