Sudheer Babu New Movie Titled as Sammohanam | సమ్మోహనమైన టైటిల్.. హిట్ కొడతాడా?

Sammohanam title for sudheer varma

Sudheer Babu, Sammohanam Movie, Mohan Krishna Indraganti, Aditi Rao Hydari, Sudheer Babu's Next Title

Sudheer Babu's Next finalized the title 'Sammohanam' for this upcoming film. Directed by Mohan Krishna Indraganti. The Movie may release it in July 2018.

సుధీర్ కొత్త సినిమా కోసం సమ్మోహనం టైటిల్

Posted: 12/28/2017 03:58 PM IST
Sammohanam title for sudheer varma

విభిన్నమైన కథా చిత్రాలను తెరకెక్కిస్తూ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును మోహనకృష్ణ ఇంద్రగంటి సొంతం చేసుకున్నారు. కాస్త గ్యాప్ తర్వాత 'జెంటిల్ మెన్' .. ' అమీ తుమీ' చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టారు. ఆయన చిత్రాలు కూడా కాస్త డిఫరెంట్ టేకింగ్ తోనే సాగుతుంటాయి.

తాజాగా ఆయన సుధీర్ బాబు కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా అదితీరావును తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాకి 'సమ్మోహనం' అనే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం.

శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా, డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కుతోందట. ఈ సినిమా తనకి హిట్ ను అందిస్తుందనే ఆశాభావంలో సుధీర్ బాబు ఉన్నాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది జూలైలో చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles