Agnyaathavaasi Trailer Date Announced | అజ్ఞాతవాసి ట్రైలర్ డేట్ వచ్చేసింది. పక్కాగా ఉంటుందంట!

Agnyaathavaasi trailer date out

Pawan kalyan, Agnyaathavaasi Trailer, Agnathavasi, PSPK 25, Trivikram Srrinivas

Agnyaathavaasi Trailer may release on Christmas next Day.Tha Makers plan with Trailer Contain with Powerful Dialogue of Power Star.

'అజ్ఞాతవాసి' ట్రైలర్ డేట్ వచ్చేసింది

Posted: 12/21/2017 06:35 PM IST
Agnyaathavaasi trailer date out

చిన్న టీజర్ తో పవన్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడు. దెబ్బకు సౌత్ లో రెండో స్థానంలో అత్యధిక లైకులు సాధించిన చిత్రంగా అజ్ఞాతవాసి టీజర్ నిలవటమే కాదు.. సినిమాపైనే టాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగి పోయేలా చేసుకున్నారు. టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో రియాక్షన్ .. ఆపై ఆడియోకు మంచి రెస్పాన్స్ రావటంతో  ఇప్పుడు అందరి కళ్లు ట్రైలర్ మీదే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 25వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలాలనుకున్నారు. కానీ క్రిస్మస్ మరుసటి రోజున, అంటే 26వ తేదీన విడుదల చేయనున్నారట.టీజర్ అత్తారింటికి దారేది తో పోల్చి చూసిన నేపథ్యంలో ఈసారి అలాంటి ఛాయలేవీ లేకుండా ట్రైలర్ ను జాగ్రత్తగా కట్ చేశారంట. పవన్ కల్యాణ్ చెప్పిన ఓ పవర్ఫుల్ డైలాగ్ పై ఈ ట్రైలర్ లో చూపించబోతున్నారంట.

పవన్ ఫ్యాన్స్ మెచ్చేలా .. సినిమాపై మరింత భారీగా అంచనాలు పెరిగేలా ఈ ట్రైలర్ ఉండనుందని సమాచారం. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, వచ్చేనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ జోడీగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా అలరించనున్నారు. కుష్బూ, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

అజ్ఞాతవాసి అఫీషియల్ టీజర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles