Financial Troubles for South Queen Movie | క్వీన్ కి కష్టాలు.. కాజల్ పైనే ప్రభావం

Kajal queen in troubles

Queen Movie, Golden Crab Film Production, South Queen Remake, Thiagarajan, Kajal Agarwaal Queen, Tamannah, Parul Yadav, Manjima Mohan

Queen South Remake in troubles. Financial Troubles for Producer Thiagarajan. Kollywood Queen Starrer Kajal may stop, Official Announcement not yet Confirmed.

క్వీన్ సౌత్ రీమేక్ కి ఆర్థిక కష్టాలు?

Posted: 12/21/2017 06:13 PM IST
Kajal queen in troubles

భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే నిర్మాతలు ఒకానోక టైంలో లెక్క అంచనా తప్పి అది ఎక్కడికో తీసుకెళ్లటం చూస్తున్నాం. మల్టీ లాంగ్వేజ్ అయితే ఆ కష్టాలు చెప్పనక్కర్లేదు. ఆ కారణంగా కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. ఆ లిస్ట్ లో 'క్వీన్' రీమేక్ కూడా ఇబ్బందుల్లో పడినట్టుగా వార్తలు వస్తున్నాయి.

కంగానా హీరోయిన్ గా హిందీలో హిట్ కొట్టిన 'క్వీన్' ను తెలుగు .. తమిళ .. మళయాళ .. కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మాత త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తెలుగులో తమన్నా .. తమిళంలో కాజల్ .. కన్నడలో పరుల్ యాదవ్ .. మలయాళంలో మంజిమా మోహన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. తెలుగు .. మలయాళ భాషల్లో నీలకంఠ, తమిళ .. కన్నడ భాషల్లో రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూలు షూటింగ్ ఫ్రాన్స్ లో నిర్వహించారు.

అయితే, ముందుగా అనుకున్న బడ్జెట్ ప్లాన్ తేడా కొట్టడంతో, ఈ ప్రాజెక్టు ఆర్థికపరమైన కష్టాల్లో పడిందట. దాంతో ఏదో ఒక భాషలోని రీమేక్ ను ఆపేసే ఆలోచనలో నిర్మాత ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ క్వీన్ విషయంలోనే ఈ సమస్య అధికంగా ఉండటంతో కాజల్ కే ఈ ఎఫెక్ట్ ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తగా మేకర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles