Agnyathavasi All Tracks Sung by Anirudh | అజ్నాతవాసి.. ఆల్బమ్ మొత్తం అతని గొంతే...

Agnyathavasi audio tracks details

Anirudh Ravichander, Agnyathavasi Movie, Agnyathavasi Tracks, Agnyathavasi Audio Tracks, Agnyathavasi Anirudh Ravichander, Agnyathavasi Songs

Music Composer Anirudh Ravichander Sung almost all songs in Agnyathavasi. Tracks list released.

అజ్నాతవాసి ఆల్బమ్.. అన్నీ అనిరుధ్

Posted: 12/19/2017 06:29 PM IST
Agnyathavasi audio tracks details

మాములుగా ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లు తమ పాట కోసం భాష రాకపోయినా.. ఒక్కో సింగర్ ను ఏరి కోరి... తమ చిత్రంలోని పాటలను పాడించుకోవటం చూస్తున్నాం. రెహ్మన్ దగ్గరి నుంచి మొదలైన ఆ ట్రెండ్ దేవీ లాంటి వాళ్ల దగ్గరికి వచ్చేసరికి బాగా ఎక్కువైపోయింది. అయితే మధ్యలో కీరవాణి, థమన్, ఆర్పీ పట్నాయక్ లాంటి వాళ్లు మాత్రం తమ గాత్రాలను ఆల్బమ్ లో చేర్చటం చూశాం. ఇప్పుడు అనిరుధ్ పవన్ అజ్నాత వాసి కోసం చేసిన పని గురించి హాట్ టాపిక్ గా మారింది.

అసలు తెలుగు భాష రాకపోయినా పవన్ చిత్రంలోని పాటలన్నీ దాదాపుగా తానే పాడేశాడు. మొత్తంగా అజ్ఞాతవాసి సినిమాలో ఐదు పాటలున్నాయి. అందులో బైటికొచ్చిచూస్తే.. గాలి వాలుగా.. ధగధగమంటే.. పాటలను అనిరుధ్ ఆలపించాడు. ట్రైలర్లో మనకు వినిపించిన స్వగతం కృష్ణా అంటూ సాగే క్లాసికల్ ఫీమేల్ సింగర్ ది. ఇక 'ఏబి ఎవరో నీ బేబీ' అంటూ సాగే మరో పాటను అజీజ్ తో పాడించాడు. ఆ విధంగా చూస్తే ఆల్బమ్ మొత్తం తన గొంతే హైలెట్ అయ్యేలా చూసుకున్నాడు. వెరైటీగా అల్బమ్ అంతా తన గొంతుతోనే నింపేస్తున్నాడు.

అయితే అదృష్టవశాత్తూ ఆ పాటలు కూడా కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి.. ఫర్వాలేదు. అన్నట్లు మరికాసేపట్లోనే పాటలు విడుదల కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles