K-pop singer Suicide with pressures of stardom | స్టార్ డమ్ ఎక్కువైంది.. ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్

South korean pop singer commits suicide

Kim Jonghyun, K-Pop Singer, Jonghyun Suicide, Jonghyun Suicide, Nine9, Kim Jonghyun, Jonghyun Suicide, Stardom Suicide, South Korean Pop Singer, Kim Jong-hyun Death, Kim Jong-hyun Suicide

Fans Mourn Death of K-Pop Star Jonghyun. Jonghyun's 'final letter' shared by close friend Nine9 after his tragic death with pressures of stardom. K-pop star Jonghyun reveals loneliness in suicide note.. 'I am broken from inside.

విపరీతమైన క్రేజ్.. తట్టుకోలేక పాప్ సింగర్ సూసైడ్

Posted: 12/19/2017 05:31 PM IST
South korean pop singer commits suicide

దక్షిణ కొరియ పాప్ సింగర్ జోంగ్‌ హ్యున్ (27) ఆత్మహత్య అక్కడి పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. అతనికి చనిపోవాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు వాదిస్తుండగా.. డిప్రెషన్ తో సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు వాదిస్తున్నారు. సోమవారం ఓ హోటల్‌ రూంలో ఓ బొగ్గులాంటి పదార్థాన్ని కాల్చి.. ఆ పొగ పీల్చి హ్యున్ (27) ఆత్మహత్యకు చేసుకున్నాడు.

ఇదే త‌న చివ‌రి ఫేర్‌వెల్ అని, పరిస్థితులు కఠినంగా మారాయని, త‌న‌ను వెళ్లనివ్వాలంటూ తన గ్రూప్ లోని నైనే అనే సభ్యురాలికి కొన్ని సందేశాలు పంపినట్లు చెబుతున్నారు. మెసేజ్‌లు వ‌చ్చిన అనంత‌రం ఆమె అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కానీ, అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఆయ‌న ఇటువంటి ఘ‌ట‌న‌కు ఎందుకు పాల్ప‌డ్డాడ‌న్న విష‌యం ఇంకా తెలియ‌రాలేదు.

అయితే నైనే విడుదల చేసిన లేఖలో ఇలా సందేశం ఉంది... పబ్లిక్ ఫిగర్ గా బతకటం చాలా కష్టంగా ఉందని.. లోలోపల నలిగిపోతున్నా.. పేరు ప్రఖ్యాతులు మాత్రమే నా లైఫ్ కాదు.. ఇప్పటిదాకా అనుభవించింది. ఒంటరితనం భరించలేకపోతున్నా.. అని ఆ సందేశాల్లో కిమ్ పేర్కొన్నాడు. ప్రేమ విఫలమా? లేక నిజంగానే ఒంటరితనంలో చనిపోయాడా? ఇలా పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా, పాప్‌స్టార్‌ కిమ్‌ జోంగ్‌ హ్యున్ చిన్న వ‌య‌సులోనే ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. రెండేళ్ల క్రితం కిమ్‌ విడుదల చేసిన ఆల్బమ్‌ బిల్‌బోర్డ్‌ వరల్డ్‌ ఆల్బమ్స్‌ చార్ట్‌లో అగ్ర‌స్థానంలో నిలిచింది.  ప్రస్తుతం జోంగ్ మృతి వార్తతో అతని అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles