Bollywood Actor Confirmed for Cherry-Boyapati Movie | బోయపాటి సినిమా.. చెర్రీ అతనికి ఓకే చెప్పాడా?

Bollywood actor confirmed for ram charan

Ram Charan, Boyapati Srinu, Vivek Oberoi, Boyapati Cherry Movie, Bollywood Actor RamCharan, RC 12, Ram Charan New Movie

Vivek Oberoi might have landed a key role in Ram Charan's next. Boyapati in discuss with Vivek for Powerful Character.

చెర్రీకి విలన్ గా వివేక్ ఒబేరాయ్

Posted: 12/18/2017 04:42 PM IST
Bollywood actor confirmed for ram charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం చిత్రం షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. దీంతో తన తదుపరి సినిమాను బోయపాటితో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. జనవరి రెండవ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

బోయపాటి మార్క్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. చరణ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుండనుందట. విలన్ పాత్రను కూడా బోయపాటి ఆ స్థాయిలోనే మలిచాడని అంటున్నారు. ఈ కారణంగానే విలన్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

దాదాపు ఆయన ఎంపిక ఖరారైపోయిందనేది తాజా సమాచారం. గతంలో ఆయన 'రక్త చరిత్ర' చేసిన సంగతి తెలిసిందే. పరిటాల రవి పాత్రలో వివేక్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇటీవల తమిళంలో వచ్చిన 'వివేగం' కూడా ఆయనకీ మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించే ఛాన్స్ ఉందని అంటున్నా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles