Sunny not Threat to Kannada Culture | సన్నీ నైట్స్.. ప్రాణాలు పోయినా నిర్వాహకులు మాత్రం అస్సలు తగ్గట్లేదు

Sunny nights karnataka denied permission

Sunny Leone, Sunny Nights Show, Karnataka New Year Celebrations, Karnataka Celebrations, Sunny Leone Dance Show

Bengaluru police say no to Sunny Leone's New Year bash. But, Organisers already sold tickets and ready to meet minister

సన్నీ నైట్స్ పై నిరసన.. జోరుగా టికెట్ల అమ్మకాలు

Posted: 12/18/2017 04:09 PM IST
Sunny nights karnataka denied permission

న్యూఇయర్ వేడుకల కోసం ఈ నెల31న బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్‌తో బెంగళూరులో ఆటాపాట నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ‘సన్నీ నైట్స్’కు అనుమతులు లేవని స్వయానా కర్ణాటక హోంశాఖా మంత్రి రామలింగారెడ్డి ప్రకటించినా లాభం లేకపోయింది.

అయితే వీటిని బేఖాతరు చేస్తూ టైమ్స్ క్రియేషన్స్‌తోపాటు మరికొన్ని సంస్థలు గంటకు రూ.50 లక్షల చొప్పున చెల్లిస్తూ ‘సన్నీ నైట్స్’ నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. సన్నీలియోన్ భద్రత కోసం మరో రూ. పది లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. గంటపాటు జరిగే సన్నీ షోలో అభ్యంతరకర అంశాలు ఉండవని, కేవలం సినిమా పాటలకు మాత్రమే ఆమె నృత్యం చేస్తారని టైమ్స్ క్రియేషన్స్ ఎండీ హరీశ్ తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.

అయితే బెంగళూరులో ఆమె అడుగుపెడితే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామంటూ కర్ణాటక రక్షణ వేదిక యువసేన ఇటీవల ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో పోలీసులు కూడా సన్నీ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మరోవైపు నిర్వాహకులు మాత్రం షో టికెట్లను యథేచ్చగా అమ్మేస్తున్నారు. అంతేకాదు మంత్రి రామలింగారెడ్డిని కలిసేందుకు సిద్ధమైపోయారు.

Sunny Leone Karnataka Bash Controversy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles