Rana Another Interest Project Commitment | మరో ఆసక్తికర కథనంతో రానా చిత్రం

Rana another project

Rana Daggubati, Rana Daggubati ARK Saravanan, Haathi Mere Saathi Rana, Haathi Mere Saathi Remake

Rana Daggubati Busy With Serial Projects. Marakathamani Director ARK Saravanan's Next with Rana. Rana Play Dual Role.

వరుస ప్రాజెక్టులతో రానా బిజీ బిజీ

Posted: 12/01/2017 06:54 PM IST
Rana another project

'బాహుబలి' మూలంగా చాలా గ్యాప్ రావటం మూలంగానో ఏమో.. రానా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. సోలో హీరోగా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నాడు. అలా ఆయన ఇప్పటికే 'ఘాజీ' .. 'నేనే రాజు నేనే మంత్రి'తో విజయాలను అందుకున్నాడు. నటన పరంగాను తనలో కొత్త కోణాన్ని చూపించాడు. కొత్తదనం కలిగిన కంటెంట్ అనిపిస్తే చాలు .. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.

అలా తాజాగా ఆయన దర్శకుడు ఏ.ఆర్.కె. శరవణన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ దర్శకుడు తెరకెక్కించిన 'మరకతమణి' అనే సినిమా తెలుగు .. తమిళ భాషా ప్రేక్షకులను ఇటీవలే పలకరించింది. ఆయన వినిపించిన కథ ఒకటి బాగా నచ్చేయడంతో, తప్పకుండా చేద్దామని రానా మాట ఇచ్చాడట. ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రానా ఇంతకుముందు కమిటైన ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. అందులో రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంతో తెరకెక్కిన కథతో పాటు అలనాటి బాలీవుడ్ రీమేక్ హాథీ మేరే సాథీ కూడా ఉంది.

హాథీ మేరే సాథీ కథాంశానికి సమకాలీన యదార్థ సంఘటనల్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో నా బాడీలాంగ్వేజ్ సరికొత్తగా వుంటుంది. మన జీవితంలో ప్రకృతి పోషించే భూమికను ఓ యువకుడు, ఏనుగు పాత్రల ద్వారా మానవీయ కోణంలో ఆవిష్కరించే చిత్రమిది అని రానా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles