Akhil on Hello Copy Right Infringement Teaser Restored | హలో టీజర్ మాయం.. అఖిల్ స్పందన.. మళ్లీ యూట్యూబ్ లో పెట్టేశారు.

Akhil recation on hello teaser disappear

Hello Teaser, Copyright Infringement, Akkineni Akhil, Akkineni Akhil Teaser, Akhil Hello Teaser

Hello teaser is back on YouTube, Akkineni Akhil says its Pheww. A miscommunication led YouTube to take down the video, citing copyright infringement.

కాపీ రైట్ వివాదంపై అఖిల్ స్పందన

Posted: 11/30/2017 12:16 PM IST
Akhil recation on hello teaser disappear

అఖిల్ అక్కినేని రెండో చిత్రం 'హ‌లో' టీజ‌ర్ యూట్యూబ్‌ నుంచి మాయమైపోవటంతో అక్కినేని ఫ్యాన్స్ లో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. మ్యూజిక్ కాపీరైట్ విష‌యంలో ఈ టీజ‌ర్‌ను తొల‌గించిన‌ట్లు యూట్యూబ్ వివరణ ఇచ్చింది. ఫిన్లాండ్‌కి చెందిన ఎపిక్ నార్త్ అనే మ్యూజిక్ సంస్థ ఈ కాపీరైట్ క్లెయిమ్ వేసింది.

చిత్ర సంగీత ద‌ర్శకుడు అనూప్ రూబెన్స్ డ‌బ్బులు చెల్లించ‌కుండానే తమ కంపెనీకి చెందిన ఎక్సోసూట్ అనే మ్యూజిక్‌ని వాడాడని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి వేరే లింకుల్లో ఈ టీజ‌ర్ అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ.. కాపీరైట్ వివాదంపై స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంది క‌నుక వివ‌రాల‌ను వెల్ల‌డిస్తున్న‌ట్లు అఖిల్ గత రాత్రి ఓ ట్వీట్ చేశాడు.

'ఇప్ప‌టికే చిత్ర టీజర్‌కి 8 మిలియ‌న్స్ వ‌చ్చాయి. హలో టీజర్ పై చేసిన కాపీ రైట్ క్లెయిమ్ గురించి చిత్ర నిర్మాత‌లుగా మేం స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. అద్భుత‌మైన నేప‌థ్య సంగీతం కోసం మేం రియ‌ల్లీ స్లో మోష‌న్‌తో ప‌నిచేసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాం. ఎలాంటి కార‌ణం లేకుండా అన‌వ‌స‌ర రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావ‌డం లేదు' అని అఖిల్ ట్వీట్ చేశాడు. అయితే టీజర్ కోసం అనూప్ అందించిన మ్యూజిక్ సెట్ కాకపోవటంతో ఇంటర్నెట్ నుంచి ఆ మ్యూజిక్ ను కొనుగోలు చేశాకే వాడుకున్నారంట. ఈ మేరకు పే మెంట్ జరిగాక.. చిన్న మిస్ కమ్యూనికేషన్ తో ఈ ఇబ్బంది ఏర్పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ మళ్ల పునరుద్ధించబడింది కూడా.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles