Rangasthalam fixed another Release Date | రంగస్థలం ఫర్ ఫెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారంట!

Rangasthalam new release date

Rangasthalam Movie, Ram Charan, Director Sukumar, RC11 Release Date, Rangasthalam Release Date, Rangasthalam March 16th

Rangasthalam Makers Change another release date. Mytri Movie Makers plan March 16th Perfect Date for Movie. Ram Charan Samantha Starrer directed by Sukumar.

రంగస్థలం.. ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Posted: 11/29/2017 04:21 PM IST
Rangasthalam new release date

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం 1985 చిత్రం అవుట్ పుట్ కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాడు. అందుకు తగ్గట్లే లెక్కల మాష్టార్ సుకుమార్ అందిస్తున్న టాస్క్ లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి కావస్తుండటంతో మిగిలిన పోర్షన్ ను కాస్త గ్యాప్ ఇచ్చి మొదలుపెట్టే ఫ్లాన్ లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ వచ్చే నెలంతా కూడా ఈ సినిమాలోని పాటల చిత్రీకరణ జరుపుకోబోతుంది. ఆ తరువాత మిగతా పనులన్నీ ఫిబ్రవరి నాటికి పూర్తిచేసుకుంటుంది. ఆ లెక్కన్న మార్చి చివరి వారం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మధ్యలోనే విడుదల చేయాలన్న ఆలోచనల్లో ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న అప్ డేట్ ప్రకారం మార్చి 16వ తేదీన సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.

సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవటంతో ఆ రోజున ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. మొత్తానికి రంగస్థలం విషయంలో చెర్రీ, మేకర్లు అభిమానులు ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ఉండే ఫ్లాన్ గీసుకుంటున్నారు.

 

రంగస్థలం కొత్త ఫోటోలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles