Burning Star Meet Telangana Chief Minister | కేసీఆర్ ను కలిసిన సంపూ.. ఎన్నికల్లో వాడుకుంటారా?

Sampoornesh babu meet t chief minister

Sampoornesh Babu, Telangana CM KCR, KCR Sampoo, Sampoo Meet KCR, Burning Star Meet KCR, KCR Sampoornesh Babu

Tollywood Actor Sampoornesh Babu Meets Telangana Chief Minister K Chandrashekhar Rao. KCR may use Sampoo Charisma in 2019 Elections.

కేసీఆర్ ను కలిసిన బర్నింగ్ స్టార్

Posted: 11/24/2017 05:02 PM IST
Sampoornesh babu meet t chief minister

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టాలీవుడ్ కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు కలిశాడు. కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నట్టు సమాచారం.

హృదయ కాలేయంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన సంపూ.. తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. అయితే యూత్ లో మాత్రం అతని క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. సినిమాలకు సంబంధించి తన భవిష్యత్ కార్యాచరణను ఈ సందర్భంగా సీఎంకు బర్నింగ్ స్టార్ వివరించాడు. కేసీఆర్ తో సంపూ భేటీ కావడం ఇదే తొలిసారి. అంతకు ముందు పలువురు సెలబ్రిటీలు, నేతలతో సంపూ ఫోటోలు దిగిన దాఖలాలు ఉన్నాయి.

తెలంగాణ సిద్ధిపేట ప్రాంతానికి చెందిన నరసింహాచారి అలియాస్ సంపూర్ణేష్ బాబుకు సినీ అభిమానుల్లో మంచి చరిష్మా ఉంది. దీంతో, 2019 ఎన్నికల్లో సంపూ చరిష్మాను ఉపయోగించుకోవాలని కేసీఆర్ కూడా భావిస్తున్నాడని పలువురు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles