Special Security Provided to Deepika Padukone | ముక్కు, తల నరికివేత హెచ్చరికలు.. దీపికకు భారీ భద్రత

Security increased to padmavati unit

Deepika Padukone, Padmavati Controversy, Deepika Padukone Security, Padmavati Issue, High Security Padmavati Team, Deepika Padukone Security

Deepika Padukone Gets Special Security After Threats Over Padmavati. Protests have been spreading against the Deepika Padukone-starrer film, with more groups joining the demand that the film be banned.

పద్మావతి వివాదం.. దీపికకు భద్రత పెంపు

Posted: 11/17/2017 09:49 AM IST
Security increased to padmavati unit

బాలీవుడ్ సినిమా పద్మావతి విడుదలను అడ్డుకుని తీరతామన్న రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. దర్శకుడు భన్సాలీ తల నరికేస్తామని.. దీపిక ముక్కు కోస్తామని హెచ్చరించారు. ‘‘రాజ్‌పుట్‌లు ఎప్పుడూ మహిళలపై చేయి లేపరు. అవసరం అయితే శూర్పణఖ ముక్కును లక్ష్మణుడు కోసినట్టు మేం దీపిక ముక్కు కోస్తాం’’ అని అందులో పేర్కొన్నారు.

కాగా, దీపిక ముక్కు కోస్తామని, తల నరికితే 5 కోట్ల నజరానా ఇస్తామని బెదిరింపులు ఎక్కువ కావడంతో నటి దీపికకు ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమెకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. తమ జాతికి ప్రతీకగా భావించే రాణి పద్మావతిని అభ్యంతరకరంగా చిత్రీకరించారని రాజ్ పుత్ కర్ణి సేన ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం నుంచే వ్యతిరేకిస్తున్నారు. పలు సందర్భాల్లో షూటింగ్ ను అడ్డుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైపూర్‌లో ఆయనపై రాజ్‌పుట్ కర్ణిసేన కార్యకర్తలు దాడి చేశారు. ఒకసారి షూటింగ్ సామగ్రిని దగ్ధం చేశారు. మరోసారి దర్శకుడు, చిత్రయూనిట్ పై దాడి చేశారు. ఇన్నిచేసినా భన్సాలీ వెనక్కి తగ్గలేదు.

సినిమా చూసిన తరువాత స్పందించాలని, పద్మావతి గౌరవాన్ని పెంచేలా సినిమా తీశామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజ్ పుత్ కర్ణిసేన కార్యకర్తలు సంజయ్ లీలా భన్సాలీకి తీవ్ర హెచ్చరికలు చేశారు. భన్సాలీ తల నరికేస్తామని హెచ్చరించారు. సినిమా విడుదలను తక్షణం నిలిపేయాలని సూచించారు. అంతేకాదు ‘పద్మావతి’ చిత్రానికి వ్యతిరేకంగా డిసెంబరు 1న దేశవ్యాప్త బంద్ నిర్వహించనున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh