Dhinchak Pooja Shocking Elimination from Bigg Boss | బిగ్ బాస్ షాక్.. ఢించక్ పూజా ఎలిమినేట్ అయ్యింది

Dinchak pooja shocking elimination

Dhinchak Pooja, Bigg Boss 11, Salman Khan, Salman Khan Bigg Boss, Salman Khan Dinchak Pooja, Bigg Boss 11 Dinchak Pooja, Dinchak Pooja Emotional Bigg Boss

Dhinchak Pooja eliminated from Bigg Boss 11 Series house. Salman Khan announced that Pooja Eliminated because of task Failure. Infact she entered in Bigg Boss 11 as a wild card contestant two weeks back. But her entry did not please some of the contestants including Hina Khan and Bandgi Kalra among others as they seemed to have preconceived notions about her.

బిగ్ బాస్ నుంచి ఢించక్ పూజా ఎలిమినేషన్

Posted: 11/06/2017 12:24 PM IST
Dinchak pooja shocking elimination

హిందీ బిగ్ బాస్ షోలో ఊహించని ట్విస్ట్. యూట్యూబ్ సంచలనం ఢించ‌క్ పూజ ఎలిమినేట్ కావటం ఆశ్చర్యానికి గురి చేసింది. రెండు వారాల క్రితం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమె షోలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఆమె ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ స‌ల్మాన్ ఖాన్ ప్ర‌క‌టించ‌గానే అంతా కంగు తిన్నారు.

నిజానికి భారీ అంచ‌నాల మ‌ధ్య అడుగుపెట్టిన ఢించ‌క్, ఇంత త్వ‌ర‌గా బిగ్‌బాస్ ఇంటి నుంచి వెళ్లిపోతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. హితేన్ తేజ్వాని, ప్రియాంక్ శ‌ర్మ‌, స‌ప్నా చౌద‌రి, శిల్పా షిండే, హీనా ఖాన్, బెనాఫ్షా సూన‌వాలా, స‌బ్య‌సాచి స‌త్ప‌తి, బంద్గీ ఖ‌ల్రాల‌తో క‌లిపి పూజ కూడా ఎలిమినేష‌న్‌కి నామినేట్ అయింది. అయితే వీరంద‌రిలోనూ పూజ ఎలిమినేట్ అవ‌డం ఓ ర‌కంగా ఊహించ‌ని ప‌రిణామ‌మే. అయితే తన ఎలిమినేషన్ ఒక రకంగా తనకు మేలు చేకూర్చిందని పూజ పేర్కొంది. తాను బిగ్‌బాస్ ఇంట్లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి ఇత‌ర కంటెస్టంట్లు త‌న‌ను టార్గెట్ చేశార‌ని, అర్షి ఖాన్‌, ఆకాశ్ ద‌డ్లానీ మిన‌హా మిగ‌తా కంటెస్టంట్లు ఎవ‌రూ త‌న‌తో క‌లిసేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌లేద‌ని పూజ తెలిపింది.

అర్షి ఖాన్‌ను కాపాడ‌టం కోసం గ‌త‌వారం త‌న‌ను తాను నామినేట్ చేసుకున్న‌ట్లు పూజ వెల్ల‌డించింది. తన ఆరోగ్యం బాగోలేకున్నా ఇంట్లో ఎవ‌రికి త‌గ్గ‌ట్లుగా వారు గేమ్ ఆడుతున్నార‌ని, హీనా ఖాన్‌, హితేన్ తేజ్వాని, శిల్పా షిండే, ప్రియాంక్ శ‌ర్మ‌లు సందర్భానికి త‌గ్గ‌ట్లుగా తెలివిగా ఆడుతున్నార‌ని చెప్పింది. బిగ్‌బాస్ ఇంట్లో తాను పాడిన పాట‌ను ఆద‌రించినందుకు అంద‌రికీ పూజ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. మరోవైపు పూజా ఎలిమేనషన్ పై సోషల్ మీడియా షరా మాములుగా జోకులు కూడా పేలుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles