Tamannaah Learns Hindi Lessons from Siva Sena Leader | శివ సేన నేత దగ్గర తమన్నా పాఠాలు

Tamannaah bhatia with siva sena leader

Tamannaah Bhatia, Vinay Shukla, Hindi Lessons, Shiv Sena, Shiv Sena Tamannah, Shiv Sena Hindi Tutor, Vinay Shukla Cine Celebrities

Actress Tamannaah Bhatia Learns Hindi Lessons Pt.Vinay Shulka well known as Celebrity Tutor. Tamanna Posted her photo along with Siva Sena's Leader Vinay Shulka.

శివసేన నేత దగ్గర తమన్నా పాఠాలు

Posted: 11/06/2017 11:52 AM IST
Tamannaah bhatia with siva sena leader

బాహుబలి రెండు పార్ట్ లు ఎంత బ్లాక్ బస్టర్లు అయ్యాయో.. అందు కోసం పని చేసిన టెక్నీషియన్లకు కూడా అంతే గుర్తింపు దక్కింది. అయితే తమన్నాకు మాత్రం దాని వల్ల ఒరిగిందేం లేదనిపించక మానదు. అందుకు కారణం అప్పటి నుంచి ఆమె కెరీర్ అస్తవ్యస్తంగా తయారు కావటమే. తెలుగులో సరైన సినిమాలు లేక.. కోలీవుడ్ లో చేసిన చిత్రాలు అంతగా ఆడక.. మరోవైపు బాలీవుడ్ లోనూ ప్రయత్నాలు బెడిసి కొట్టడం మిల్కీ బ్యూటీకి నిరాశ కలిగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమె హిందీ పై ఇప్పుడు దృష్టిసారించటం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ హిందీ పండింట్ వినయ్ శుక్షా దగ్గర హిందీ ట్యూషన్ కి హాజరయ్యింది. ఆయన దగ్గర భాష నేర్చుకుంటున్నానని చెబుతూ కొన్ని ఫోటోలు ట్వీట్ చేసింది. ఇంతకీ ఆయనెవరో కాదు శివ సేన నేత. ఐసీఎస్సీ, సీబీఎస్సీ విద్యార్థులకి హిందీ పాఠాలు సులభంగా నేర్చించే పంతులు. అంతేకాదు పలువురు సెలబ్రిటీలు ఆయన దగ్గర భాష నేర్చుకున్నారు. ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య, నటి శృతీ హాసన్ వీరంతా ఆయన దగ్గర హిందీ పాఠాలు నేర్చుకునేవారు.

నార్త్ బ్యూటీ అయినప్పటికీ తమన్నాకు హిందీ అంత బాగా రాదన్న విషయం తెలియంది కాదు. అందుకే బాలీవుడ్ లో సరైన హిట్లు లేని తమన్నా ఎలాగైనా హిందీ చిత్రసీమలో తన పేరు నిలుపుకోవాలని ఇప్పుడు బాగా కష్టపడుతోంది. ప్రస్తుతానికి క్వీన్ రీమేక్ లో తమన్నా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles