Powerful Dialogue Writer for Chiru's Sye Raa | సైరా కోసం శాతకర్ణి డైలాగ్ రైటర్.. పవర్ ఫుల్ డైలాగులేనంట!

Satakarni technician for satakarni

Chiranjeevi, Chiru 151 Movie, Sye Raa Movie, Sye Raa Dialogues, Chiru's Sye Raa, Sye Raa Satakarni, Satakarni Writer For Sye Raa Movie, Sai Madhav Burra, Sai Madhav Burra Sye Raa

Powerful Dialogue writer for Chiranjeevi's Sye Raa Movie,. Sai Madhav Burra Consider for Uyyalawada's Biopic. In Past Sai penned dialogues for Gautamiputra Satakarni, Gopala Gopala, Malli Malli Idi Rani Roju etc.

సైరా కోసం శాతకర్ణి డైలాగ్ రైటర్

Posted: 11/03/2017 05:02 PM IST
Satakarni technician for satakarni

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఉయ్యలవాడ నరసింహా రెడ్డి జీవిత గాథను 'సైరా' నరసింహా రెడ్డి గా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. పక్కా స్క్రిప్ట్ సిద్ధం కావటంతో ప్రస్తుతం చిత్ర షూటింగ్ మొదలుపెట్టేందుకు అనువైన ముహుర్తం కోసం ఎదురు చూస్తున్నారు.

మెగా తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మించబోతున్న సైరా డిసెంబర్ 6వ తేదీ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో వున్నారు. చారిత్రక నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో, చిరూ ఉయ్యలవాడ నరసింహారెడ్డి లాంటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆ సమరయోధుడికి తగ్గట్లే గంభీరమైన వేషధారణ.. బాడీ లాంగ్వేజ్ కి మారే పనిలో చిరు బిజీగా ఉన్నాడు.ఇక ఈ చిత్రం కోసం రచయిత సాయిమాధవ్ బుర్రా రంగంలోకి దిగాడు.

గతంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' కోసం ఆయన రాసిన మాటలు ఎంతటి ఉత్తేజాన్ని కలిగించాయో తెలిసిందే. ప్రాణాలను సైతం గడ్డిపోచగా భావించే ఓ పోరాటయోధుడి పాత్రలో చిరు కోసం పదునైన సంభాషణలను సాయిమాధవ్ రాశాడట. ఈ డైలాగ్స్ మెగా ఫ్యాన్స్ లో ఊపు తెస్తాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles