Susheelamma Says Don't Believe Rumours | వాళ్లకు ఏంటి ఈ దౌర్భగ్యం? బతికున్నానంటూ వీడియో పెట్టిన సుశీలమ్మ

Susheela on death hoax

P Susheela, P Susheela Death Hoax. P Susheela Death Rumours, P Susheela Video, P Susheela Tamil Speech, P Susheela Latest Video

P Susheela death hoax. Legendary Singer releases video, clarifies that she is alive and well. She is visiting the United States at the moment, and will be returning to India on Saturday.

నేను క్షేమంగా ఉన్నా : గాయని సుశీల

Posted: 11/03/2017 04:25 PM IST
Susheela on death hoax

ఫేక్ న్యూస్ లు, ఇష్టం వచ్చినట్లు రాతలు నియంత్రించేందుకు వెబ్ సైట్లపై నియంత్రంణకు క్రైమ్ బ్రాంచ్ పూనుకున్న విషయం తెలిసిందే. ఇకపై అలాంటి కథనాలు రాస్తే కఠిన చర్యలు మాత్రమే కాదు.. జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా.

దీంతో మరో రూట్ ను ఎంచుకుంటున్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకుంటూ ఆపై కథనాలను ప్రచురిస్తున్నాయి. గత రాత్రి సీనియర్ గాయకురాలు పి సుశీల అనారోగ్యంతో చనిపోయిందన్న ఓ వార్త బాగా వైరల్ అయ్యింది. దీంతో వెంటనే సుశీల స్పందించారు. ఏకంగా ఓ వీడియో సందేశం ద్వారా తాను క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇంకోవైపు తమిళ పీఆర్వో ఒకాయన కూడా డల్లాస్ లో ఉన్న ఆమె ఫోటోను షేర్ చేసి పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేశారు.

అయితే దీని వెనుక ఓ ప్రముఖ మీడియా సంస్థ హస్తం ఉందన్న వాదన వినిపిస్తోంది. కేవలం వ్యూవ్స్ కోసం ముందు ఆమె మరణించిందన్న వార్త సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి.. ఆపై ఆమె ప్రకటననే ప్రముఖంగా ప్రచురించటంపై కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఓ లెజెండరీ గాయని తాను స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పే పరిస్థితి వచ్చిందంటే... మన మీడియా ఎంత దిగజారిందో చెప్పకనే చెబుతోందన్నది సీనియర్ విశ్లేషకుల భావన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles