RGV Post Ultra Ultimate Image of Lakshmi's NTR | వర్మకు అసలు ఈ ఫోటోలు ఎక్కడ దొరుకుతున్నాయ్

Rgv post chandrababu marriage pic

Ram Gopal Varma, Lakshmi's NTR, Lakshmi's NTR Ultra Ultimate Pic, RGV NTR Couple Pic, RGV Chandrababu Marriage Pic, RGV Lakshmi's NTR

Ram Gopal Varma Posted Ultra Ultimate Image in Facebook. Chandrababu Marriage pic along with NTR Couple.

అల్ట్రా అల్టీమేట్ ఇమేజ్ పోస్ట్ చేసిన వర్మ

Posted: 10/31/2017 04:40 PM IST
Rgv post chandrababu marriage pic

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రకటించిన నాటి నుంచి ఎన్నో విమర్శలు. ఎన్టీఆర్ కీర్తికి భంగం వాటిల్లకుండా ఈ చిత్రాన్ని రూపొందించాలని, లేని పక్షంలో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని నాయకులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మీ పార్వతి కూడా ఈ విషయంలో గట్టి హెచ్చరికే జారీ చేశారు. అయితే వాటి మాటలను పట్టించుకుంటున్నాడో లేదో తెలీదు కానీ వర్మ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

ఈ క్రమంలో నిన్న తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.‘హరిణి తన అద్భుత అవగాహనతో, సృజనాత్మకతతో, అసాధారణ రీతిలో రూపొందించిన అల్ట్రా అల్టీమేట్ ఇమేజ్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది’ అని ఫేస్ బుక్ లో ఫోటో షేర్ చేశారు. అది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి ఫోటో. అందులో చంద్రబాబునాయుడు, భువనేశ్వరి నూతన దంపతులుగా.. పక్కే ఎన్టీఆర్ దంపతులు ఉన్నారు. ఆ ఫోటో కిందే‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్ ఉంది.

ఈ మధ్య చంద్రబాబునే టార్గెట్ చేస్తూ స్పెషల్ గా సందేశాలు ఉంచుతున్న వర్మ చిత్రంలో లక్ష్మీ పాత్రతోపాటు బాబు పాత్రను ఎలా ఛూపించబోతున్నాడు.. అన్నది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో అందరికీ కలుగుతున్న అనుమానం ఏంటంటే.. అసలు ఆయనకు ఆ ఫోటోలు ఎక్కడివని...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles