హీరోయిన్ల మధ్య కెరీర్ పరమైన ఫైట్ కు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. బాయ్ ఫ్రెండ్ లను లాక్కునే వ్యవహారం తప్పించి... మిగతావారంతా ఇప్పుడు అంతా స్నేహపూర్వకంగానే మెదలుతున్నారు. అయితే ఇది ఏ ఒక్క ఇండస్ట్రీకో పరిమితం కావట్లేదు. అలా బాలీవుడ్ లో కత్రినా కైఫ్-అలియా భట్ ల మధ్య స్నేహం గురించి మాత్రం ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉంటున్నారు.
అయితే రీసెంట్ గా కత్రినా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో వారి మధ్య బాండింగ్ గురించి మరోసారి తెలియజేసింది. సీనియర్ గా అలియాకు సలహాలు ఇవ్వటంతోనే కాదు.. జిమ్ లోనూ కోచ్ గా ఇలా పాఠాలు కూడా నేర్పిస్తోందని ఆ వీడియో చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. జిమ్‌లో శిక్షకురాలు యాస్మిన్ కరాచీవాలా విధులకు రాలేదంట. దీంతో క్యాట్ కోచ్ అవతారం ఎత్తి ఇలా ట్రైనింగ్ ఇస్తుందన్న మాట. గతంలో వీరిద్దరికీ సంబంధించి కొన్ని ఫ్రెండ్లీ వీడియోలు, ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే అలియాను పాపం అంతలా కష్టపెట్టాలా? అంటూ వీడియో కింద కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సినిమాల పరంగా చూసుకుంటే అలియా రాజీ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకోగా.. కత్రినా సల్మాన్ ఖాన్ తో టైగర్ జిందాహైలో నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలె బయటకు రాగా.. డిసెంబర్ 22న విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more