Nanna Koochi Trailer Get Good Response | నాన్న కూచి మరో ముద్ద పప్పు ఆవకాశ అవుతుందా?

Nanna kuchi trailer impressive

Niharika Kondela, Nanna Koochi , Web series, Telugu Web Series, Niharika Kondela New Trailer, Niharika Kondela Nanna Koochi , Naga Babu Web series, Niharika Naga Babu Movie

Niharika Kondela's Nanna Koochi Trailer Released and Get Good Response in YouTube.

నాన్న కూచి ట్రైలర్ కి గుడ్ రెస్పాన్స్

Posted: 10/30/2017 03:24 PM IST
Nanna kuchi trailer impressive

మెగా డాటర్ రెండో సినిమా హ్యాపీ వెడ్డింగ్ సెట్స్ పై ఉండగానే మరోసారి వెబ్ సిరీస్ తో సందడి చేసేందుకు సిద్ధమైపోయింది. స్వయం నిర్మాణంలో గతంలో ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ చేసి ప్రశసంలు అందుకున్న నిహారిక ఇప్పుడు 'నాన్న కూచి' అనే వెబ్ సిరీస్ తో రాబోతున్న విషయం తెలిసిందే.

రియల్ ఫాదర్-డాటర్ నాగబాబు-నిహారికలు ఇందులో కూడా అదే రోల్స్ లో నటిస్తున్నారు. ఆనంద్ రాజ్ పాత్రలో నాగబాబు , ఆయన కూతురు తార పాత్రలో నిహారిక కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ నుంచి ఈ మధ్యే ఓ ట్రైలర్ రిలీజ్ కాగా, అది ఇప్పుడు ఆకట్టుకుంటోంది. తండ్రీ కూతుళ్ల అనుబంధానికి అద్దం పడుతూ ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుందని తెలుస్తోంది.

 

ఆ ఇద్దరి జీవితాల్లోని ప్రేమ కోణాలతో కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుందనేది ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. తండ్రి, కూతులిద్దరీకి వాళ్ల వాళ్ల ప్రేమ వ్యవహారాలు నచ్చకపోవటమనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ కథను తెరకెక్కించారు.మరి మొదటి సిరీస్ లాగే ఇది ఆకట్టుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh