Bharateeyudu Movie Not Shelved | భారతీయుడు-2 ఇంతకీ ఉందా? లేదా?

Kamal haasan s bharateeyudu 2 on cards

Bharateeyudu 2, Bharateeyudu 2 Not Shelved, Bharateeyudu 2 Kamal Haasan, Dil Raju Kamal Haasan, Kamal Haasan Bharateeyudu 2

Bharateeyudu 2 Not Shelved. Kamal Haasan Shankar and Dil Raju team up for this movie.

భారతీయుడు-2 ఆగిపోలేదు

Posted: 10/17/2017 04:25 PM IST
Kamal haasan s bharateeyudu 2 on cards

కమల్ హాసన్ కెరీర్ లో మైలు రాయి లాంటి చిత్రం భారతీయుడు. శంకర్ డైరెక్షన్ లో రెండు దశాబ్దల క్రితం వచ్చిన ఈ చిత్రం ఇండియన్ స్క్రీన్ పై ఓ సంచలనం. అవినీతి, లంచగొండితనం కాన్సెప్ట్ లతో వచ్చిన భారతీయుడు ఓ ట్రెండ్ సెట్టర్. గత కొంత కాలంగా ఈ చిత్రం రెండో పార్ట్ రాబోతుందన్న వార్తలు జోరందుకున్న విషయం తెలిసిందే.

ఈ భారతీయుడు 2కి అదనపు ఆకర్షణ ఏంటంటే.. దిల్ రాజు వ్యవహరిస్తుండటం.. దానిపై అఫీషియల్ గా తమిళ బిగ్ బాస్ లోనే ప్రకటన రావటంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రాజెక్టు నుంచి కమల్ తప్పుకున్నారనీ .. ఆయన ఈ సినిమా చేయడం లేదనే ప్రచారం కొన్ని రోజులుగా జోరందుకుంది. ఈ వార్త నిజమేనా? .. కారణాలేంటి? అనే సందేహాలు అభిమానులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ స్పందించింది. 'భారతీయుడు' సీక్వెల్ ప్రాజెక్టు నుంచి కమల్ తప్పుకోలేదనీ, ఆయన ఈ సినిమా చేయడానికి సిద్ధంగా వున్నారని స్పష్టం చేశారు.

దర్శకుడు శంకర్ సినిమాలు ఒక్కోక్కటి తర్వాతి చిత్రాల రికార్డులను చెరిపేస్తుంటాయి. ఈ నేపథ్యంలో 2.0 తర్వాత తెరకెక్కబోయే ఈ చిత్రం ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి. కమల్ రాజకీయాల నేపథ్యంలో స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉన్న మూవీ పడితే మాత్రం అది అడ్వాంటేజ్ అయ్యి తీరుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles