Nagarjuna Confirmed Movie with Nani | నాని క్రేజీ.. నాగ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్

Senior hero confirm movie with nani

Akkineni Nagarjuna, Natural Star Nani, Director Sriram Aditya, Multi-starrer, Nag Nani Movie

Akkineni Nagarjuna has finally broken the silence and confirmed about the project. Nagarjuna said that he is very impressed with the script as both him and young hero Nani are playing very interesting roles. Nag also added that the film will be a complete fun ride and will go on floors in the month of Jan or Feb 2018.

నానితో సినిమా చేస్తున్నా : నాగ్

Posted: 10/03/2017 03:53 PM IST
Senior hero confirm movie with nani

టాలీవుడ్ లో మళ్లీ మల్టీస్టారర్ చిత్రాలకు పాత రోజులు వచ్చేసినట్లే. అగ్ర హీరోల దగ్గరి నుంచి చిన్న చితకా హీరోల దాకా ఈ మధ్య వరుసబెట్టి కలిసి నటించేస్తున్నారు. ఈ క్రమంలో ఇగోలు, స్టార్ డమ్ లు లాంటివి పట్టించుకోకుండా కథాబలంతోనే సినిమాలను ఒప్పేసుకుంటున్నారు.

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో వినిపిస్తున్న ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఇప్పుడు ఖరారైంది. ఓ బిగ్ బ్యానర్ పై ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. 'భలే మంచిరోజు' .. 'శమంతకమణి' సినిమాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నాగార్జున .. నాని కలిసి నటిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవమేనని తాజాగా నాగార్జున స్పష్టం చేశారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తాను మల్టీస్టారర్ మూవీ చేయనుండటం నిజమేనని అన్నారు. పైగా ఈ సినిమాలో నాని పాత్ర ఎంతో సరదాగా సాగిపోతుందని, తన పాత్ర కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అన్నారు. అభిమానులందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. 2018 ఫిబ్రవరి కల్లా షూటింగ్ అయిపోయి సినిమా సమ్మర్ లోనే రిలీజ్ అవుతుందని హింట్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం నాగ్ నటించిన రాజు గారి గది 2 రిలీజ్ కు రెడీ అవుతుండగా.. నాని ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles