Balakrishna Again Slaps TDP Activist | మరోసారి చెంప చెల్లుమనింపిచిన బాలయ్య.. ఎందుకో చూడండి

Balayy again slap tdp member

TDP, MLA Balakrishna, Hindupur Constituency, Intintiki TDP Campaign Viral Video, Balakrishna Slaps Party Activist

Actor, TDP MLA Nandamuri Balakrishna Slaps Party Activist in Hindupur Intintiki TDP Campaign. Video Viral After Balayya Warn that activist.

మరోసారి చేతి వాటం చూపిన బాలయ్య

Posted: 10/03/2017 03:40 PM IST
Balayy again slap tdp member

అగ్ర న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ మరోసారి అసహనాన్ని ప్రదర్శించారు. దూకుడు స్వభావం చూపే ఆయన మరోసారి చెంప చెల్లుమణిపించాడు. తరచూ ఈ మధ్య ఇలాంటి వార్తలతో హైలెట్ అవుతున్న బాలయ్య మరోసారి అలాంటి సీన్ తోనే నిలిచారు.

హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలంతా కలిసి ముందుకు వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా తోపులాట సాగింది. అయితే పక్కనే ఉన్న ఓ అభిమాని బాలయ్య కంటే ముందు వెళ్లటానికి యత్నించాడు. ఈక్రమంలో అతను బాలయ్య మీద పడిపోగా, ఆయనకు అసహనంతో చిర్రెత్తుకొచ్చింది.


 

అంతే ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య ఆ కార్యకర్త చెంపను వాయించేశాడు. ఆపై ఎందుకంత తొందరంటూ అతనిని వారించి ముందుకు సాగారు. బాలయ్య చేసిన ఆ పనితో ఆ కార్యకర్త బిత్తరపోగా.. మిగతా వారంతా షాక్ కి గురయ్యారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో బాలయ్య పై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. గతంలో సెల్పీ కోసం ట్రై చేసిన ఫ్యాన్ ఫోన్ విసిరేయటం.. వ్యక్తిగత సహయకుడితో చెప్పులు మోయించటం.. కొట్టడం.. ఇలాంటి ఘటనలు తెలిసినవే కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles