Jai Lava Kusa Hits Century at Box Office | వంద కోట్లు వచ్చేశాయ్.. ఇక ముందు ఎలా ఉంటుందో?

Ntr jai lava kusa century collections club

Jai Lava Kusa, Jai Lava Kusa Collections, Jai Lava Kusa Century Club, Jai Lava Kusa Collections

Jai Lava Kusa' Box Office Day 6. Jr NTR starrer rakes in Rs 103 Cr. Amid Spyder and Mahanubhavudu Release how those collections continue.

వంద కోట్ల క్లబ్ లో జై లవ కుశ

Posted: 09/27/2017 05:18 PM IST
Ntr jai lava kusa century collections club

గత వారమే రిలీజ్ అయిన జై లవ కుశ చిత్రం ఊహించని వసూళ్లను సొంతం చేసుకుంది. ఆరో రోజులు వచ్చిన కలెక్షన్స్ తో మొత్తానికి తారక్ వంద కోట్ల బిజినెస్ హీరోగా నిరూపించుకున్నాడు. ఫస్ట్ వీక్ సెలవులు సినిమాకు బాగా ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు. దానికి తోడు కథలో ఎమోషన్లు, పాజిటివ్ టాక్ కూడా చిత్రం హిట్ కావటానికి కారణాలయ్యాయి.

ఎన్టీఆర్ సోలో పర్ఫామెన్స్ గా చెప్పుకునే త్రిపాత్రాభినయం సినిమాకి ప్రధాన హైలెట్ గా నిలిచింది. పాత్రలో ప్రాణం పెట్టి నటించడం తో అభిమానులు సినిమాను రెండవసారి చూడటానికి కూడా వెళుతున్నారు. అందుకే ఎన్టీఆర్ కెరీర్ లో జై లవకుశ చాలా స్పెషల్ అని చెప్పాలి. జై లవకుశ అనుకున్నట్టుగానే తారక్ సినిమాల్లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆయన గత చిత్రాల విజయాలు ఈ సినిమా మార్కెట్ కి బాగా ఉపయోగపడ్డాయి. సినిమా కథాంశం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడంతో మంచి కలెక్షన్స్ ని సాధించింది.

బీసీ సెంటర్ లలో నందమూరి వారసుడు ఊహించిన దానికంటే ఎక్కువ భాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్నాడు. కొన్ని ఏరియాల్లో బాహుబలి తర్వాత ప్లేస్ లో నిలిచింది కూడా. మున్ముందు బయ్యర్స్ కి కూడా మంచి లాభాల బాటనే అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్ర కలెక్షన్లు 103 కోట్లు. స్పైడర్, మహానుభావుడు రిలీజ్ అవుతుండటంతో సెకండ్ వీక్ కూడా అదే ఊపులో ఉంటుందో లేదో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles