PC Becomes 8th Highest Paid Actress Globally | హాలీవుడ్ లిస్ట్ లో ప్రియాంకకు చోటు

Highest paid tv actress priyanka chopra in eighth

Priyanka Chopra, Priyanka Chopra Highest Actress, Sofia Vergara Top Position, Sofia Vergara tops, Sofia Vergara Highest Paid Actress

Priyanka Chopra scores 8th position on Forbes highest paid TV actresses' list. Sofia Vergara tops list constructively 6th Time.

హాలీవుడ్ బుల్లితెర లిస్ట్ లో ప్రియాంకకు చోటు

Posted: 09/27/2017 04:42 PM IST
Highest paid tv actress priyanka chopra in eighth

బాలీవుడ్ సోయగం ప్రియాంక చోప్రా మ‌రోసారి అంత‌ర్జాతీయ స్టార్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. ప్రపంచంలో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న టీవీ న‌టీమ‌ణుల జాబితాలో చోటు సంపాదించింది. ఫోర్బ్స్ మేగ‌జైన్ విడుద‌ల చేసిన ఈ జాబితాలో పిగ్గీ చోప్స్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

జూన్ 1, 2016 నుంచి జూన్ 1, 2017 మ‌ధ్య కాలంలో టీవీ కార్య‌క్ర‌మాల ద్వారా ఆమె 10 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించిన‌ట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇందులో యాడ్స్ ద్వారానే ఆమె సగానికి పైగా ఆదాయం సంపాదించటం విశేషం. కాగా, `క్వాంటికో` టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్ బుల్లితెర మీద అడుగు పెట్టిన ప్రియాంక, కొద్దికాలంలోనే త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ క్రమంలోనే బేవాచ్ సినిమాలో కూడా నటించి ప్రస్తుతం రెండో హాలీవుడ్ మూవీలోనూ పని చేస్తోంది.

ఇక గతేడాది కూడా ఈ లిస్ట్ లో ప్రియాంక సేమ్ 8వ స్థానంలోనే నిలవటం విశేషం. ఈ జాబితాలో ఈసారి కూడా కొలంబియా న‌టి సోఫియా వెర్గారా 41.5 మిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న‌తో మొద‌టి స్థానంలో నిలిచింది. గ‌త ఆరేళ్ల నుంచి సోఫియా వెర్గారానే మొద‌టి స్థానంలో ఉంది. ఈమె న‌టిస్తున్న `మోడ్ర‌న్ ఫ్యామిలీ` టీవీ సిరీస్‌కు అమెరికాలో మంచి పేరుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా క్వోంటికో సిరీస్‌కి సంబంధించిన మూడో సీజ‌న్ షూటింగ్‌ లో బిజీగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles